ఒక్క అమ్మాయి కోసం..!

ఈ ఫొటోలో క‌నిపిస్తున్న ఇద్ద‌రు యువ‌కులు ప్రాణ స్నేహితులు. రియాజ్ స‌వ‌ణూర‌, ఫిరోజ్ హ‌న‌సి అనే ఆ ఇద్ద‌రూ ఒక్క అమ్మాయి కోసం దారుణంగా హ‌త్య‌కు గుర‌య్యారు. ఈ దారుణ ఘ‌ట‌న క‌ర్ణాట‌న‌లోని హుబ్బ‌ళ్లిలో చోటు చేసుకుంది. ఆ ఇద్ద‌రు ప్రాణ స్నేహితుల‌ను హ‌త్య చేసింది కూడా వేరెవ‌రో కాదు.. వారి స్నేహితులే. హంత‌కుల‌ను వసీం, అకిల్‌గా గుర్తించారు.

ఈ ఇద్ద‌రితో పాటు మ‌రొక‌రికి ప్ర‌త్య‌క్షంగా ప్ర‌మేయం ఉన్న‌ట్లు పోలీసుల ద‌ర్యాప్తులో తేలింది. హుబ్బ‌ళ్లి జిల్లాలోని షేక్షాపుర‌కు చెందిన రియాజ్, మిల‌త్ న‌గ‌ర ప్రాంతానికి చెందిన ఫిరోజ్ ప్రాణ స్నేహితులు. చిన్ప‌ప్ప‌టి నుంచీ ఒకేచోట చ‌దువుకున్నారు. వారితో పాటు వారి స్నేహం కూడా పెరిగి పెద్ద‌ద‌యింది.

రియాజ్‌, ఫిరోజ్‌, వ‌సీం, అకిల్ స్నేహితులే. ఒక అమ్మాయి విష‌యంలో అయిదుమంది స్నేహితుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చోటు చేసుకుంది. ఈ ఘ‌ర్ష‌ణ ప్రాణాల‌ను తీసుకునేంత వ‌ర‌కూ వెళ్లింది. హుబ్బ‌ళ్లిలోని అజంత హోట‌ల్ వ‌ద్ద రియాజ్‌, ఫిరోజ్‌ల‌పై వ‌సీం, అకిల్‌తో పాటు మ‌రో స్నేహితుడు క‌త్తితో దాడి చేశారు.

ఇద్ద‌ర్నీ పొడిచి పారిపోయారు. క‌త్తిపోట్ల‌కు గురైన రియాజ్‌, ఫిరోజ్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ మ‌ర‌ణించారు. ఈ కేసులో పోలీసులు వ‌సీం, అకిల్‌ల‌ను అరెస్టు చేశారు. మ‌రో యువ‌కుడిని అరెస్టు చేయాల్సి ఉంది. హుబ్బ‌ళ్లి పోలీసులు కేసు న‌మోదు చేసుకుని, ద‌ర్యాప్తు ఆరంభించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here