సైరాలో హుమా ఖురేషి ?

అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న మెగాస్టార్ చిరంజీవి హీరోగా న‌టిస్తున్న‌  సైరా సినిమా.  సురేందర్ రెడ్డి దర్శకత్వంలో  హైదరాబాద్ లో జోరుగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాలో మరో గ్లామర్ భామ నటిస్తుందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే మెగాస్టార్ సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా తమన్నా కూడా ఈ సినిమాలోకి ఎంట్రీ ఇచ్చింది.

లేటెస్ట్ గా సూపర్ స్టార్ రజని కాంత్ తో కాలా సినిమాలో నటించిన హుమా ఖురేషి ఎంట్రీ ఇవ్వనుంది. హుమా ఖురేషి బాలీవుడ్ లో గ్లామర్ హీరోయిన్ గా మంచి క్రేజ్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. సైరా సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ ఉంటారన్న విషయం మొదటి నుండి ప్రచారంలో ఉంది. ఈ నేపథ్యంలో హుమా ఖురేషి ఎంట్రీ ఇవ్వడంతో ఆ న్యూస్ నిజమని తేలింది. త్వరలోనే ఆమె షూటింగ్ లో జాయిన్ కానుందట. రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాదిలో విడుదల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here