20 అడుగుల మొసలి కడుపులో మనిషి చేయి, కాలు దొరికాయి..!

20 అడుగుల పొడవైన మొసలి.. ఓ మనిషిని తినేసింది అని అందరూ భావించారు. అనుకున్నట్లుగానే దాన్ని పట్టుకొని.. చంపేశారు ఆ గ్రామస్థులు. వారి అనుమానం నిజమైంది. ఓ మనిషిని తినేసి తన కడుపులో అరిగించుకునే స్థితిలో ఉంది. దాని కడుపులో నుండి కాలు, చేతిని బయటకు తీశారు గ్రామస్థులు. ఈ ఘటన ఇండోనేషియా లోని బోర్నియోలో చోటుచేసుకుంది.

స్థానికంగా పామాయిల్ తోటలో పనిచేసే 36 సంవత్సరాల ఆండీ అనే వ్యక్తి కనిపించకుండా పోయాడు. అయితే అక్కడ ఉన్న నదీ తీరంలో అతడి బైక్, చెప్పులు కనిపించాయి. మరో రెండు రోజుల తర్వాత ఆండీ శవం కనిపించింది కానీ అతడి శరీరంలో చాలా భాగాలు అప్పటికే ఎవరో చీల్చేసారు. అయితే ఆ నదిలో ఓ మొసలి ఉండడాన్ని కూడా స్థానికులు గమనించారు. తప్పకుండా ఆండీని అదే తిని ఉంటుందని భావించి పోలీసుల సహాయంతో దాన్ని చంపేశారు. దాని కడుపు కోయగా ఆండీ చేయి, కాలు ఉన్నాయి. ఓ మొసలి మనిషిని చంపి తినడం చాలా ఏళ్లుగా జరగలేదని స్థానికులు చెబుతున్నారు. తినడానికి ఆల్చిప్పలు తేవడానికి తన భర్త ఇంటి నుండి నది దగ్గరకు వచ్చాడని ఆండీ భార్య ఏడుస్తూ చెప్పింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here