రెండోభార్య మ‌రొక‌రితో స‌న్నిహితంగా ఉంటోంద‌ని..నాలుగేళ్ల కుమార్తె స‌హా ఎవ్వ‌ర్నీ వ‌ద‌ల్లేదు!

సంచ‌ల‌నం రేపిన చందాన‌గ‌ర్ ట్రిపుల్ మ‌ర్డ‌ర్ కేసు మిస్ట‌రీ వీడింది. మృతురాలి భ‌ర్త మ‌ధు హంత‌కుడ‌ని తేలింది. తానే ఈ మూడు హ‌త్య‌ల‌ను చేసిన‌ట్టు అంగీక‌రించాడు.

చందాన‌గ‌ర్ పోలీస్‌స్టేష‌న్‌లో లొంగిపోయాడు. త‌న రెండో భార్య అప‌ర్ణ వేరొక‌రితో స‌న్నిహితంగా ఉంటోంద‌నే ఉద్దేశంతోనే తాను ఈ హ‌త్యలు చేసిన‌ట్టు అత‌ను పోలీసుల వ‌ద్ద వెల్ల‌డించాడు.

చందాన‌గ‌ర్ వేమ‌కుంటలో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో అప‌ర్ణ అనే మ‌హిళ‌, ఆమె త‌ల్లి, కుమార్తె దారుణ హ‌త్య‌కు గురైన విష‌యం తెలిసిందే.

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాకు చెందిన అప‌ర్ణ ప‌దేళ్ల కింద‌ట హైద‌రాబాద్‌కు వ‌చ్చారు. ఓ ప్రైవేట్ సంస్థ‌లో ఎగ్జిక్యూటివ్‌గా ప‌నిచేస్తున్నారు.

ఆ స‌మ‌యంలో ఆమెకు ముర‌ళి అనే సెల్‌ఫోన్ దుకాణ య‌జ‌మానితో ప‌రిచ‌యం ఏర్ప‌డింది. అది ప్రేమ‌కు దారి తీసింది. మ‌ధుకు ఇదివ‌ర‌కే పెళ్లయి, ఇద్ద‌రు పిల్లలు కూడా ఉన్నారు.

ఆ విష‌యాన్ని దాచిపెట్టి అప‌ర్ణ‌ను ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఆ విష‌యం త‌న మొద‌టి భార్య యామిని, పిల్ల‌ల‌కు తెలియ‌కుండా జాగ్ర‌త్త‌ప‌డ్డాడు.

మ‌ధుకు ఇదివ‌ర‌కే పెళ్లయింద‌నే విష‌యం అప‌ర్ణ‌కు కూడా తెలియ‌దు. ముర‌ళి, అప‌ర్ణ‌కు కుమార్తె జ‌న్మించింది. ఆ నాలుగేళ్ల పాప పేరు కార్తికేయి.

రెండు నెల‌ల కింద‌ట ఈ రెండు పెళ్లిళ్ల‌ వ్య‌వ‌హారం వెలుగులోకి వ‌చ్చింది. భ‌ర్త రెండో పెళ్లి చేసుకోవ‌డాన్ని జీర్ణించుకోలేని యామిని.. త‌ర‌చూ అత‌నితో గొడ‌వ ప‌డుతుండేది.

అప‌ర్ణ అడ్ర‌స్ తెలుసుకుని వ‌చ్చి ఆమెతోనూ ఘ‌ర్ష‌ణ ప‌డుతుండేది. దీనితో మ‌ధు త‌లెత్తుకోలేని స్థితికి చేరుకున్నారు. ఒక‌వంక యామిని, మ‌రోవంక అప‌ర్ణ‌లు త‌ర‌చూ అత‌నితో ఘ‌ర్ష‌ణ ప‌డుతుండ‌టం, న‌లుగురిలో త‌లెత్తుకోలేని ప‌రిస్థితి ఏర్ప‌డింది.

దీనితో అతను.. అప‌ర్ణ‌ను హ‌త‌మార్చాల‌ని నిర్ణ‌యానికొచ్చాడు. మ‌ద్యం సేవించి అప‌ర్ణ ఉండే ఇంటికి వెళ్లాడు. మొద‌ట అత్త జ‌య‌ల‌క్ష్మిని, ఆ త‌రువాత కుమార్తె కార్తికేయి దారుణంగా హ‌త‌మార్చాడు.

ఆ స‌మ‌యంలో అప‌ర్ణ ఇంట్లో లేదు. ఇంటికొచ్చిన త‌రువాత రాడ్‌తో అప‌ర్ణ త‌ల‌పై కొట్టాడు. ర‌క్త‌పుమ‌డుగులో ప‌డి ఆమె ప్రాణాలు వ‌దిలింది.

ఫ్లాట్‌కు తాళం వేసి పారిపోయాడు. రెండురోజుల త‌రువాత ఫ్లాట్ నుంచి దుర్వాస‌న వ‌స్తుండ‌టంతో ప‌క్కింటి వాళ్లు ఓన‌ర్‌కు స‌మాచారం ఇచ్చారు.

ఆయ‌న చందాన‌గ‌ర్ పోలీసుల‌కు స‌మాచారం ఇవ్వ‌డంతో అస‌లు విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. ముర‌ళిపై కేసు న‌మోదు చేశారు.

ఈ విష‌యం తెలిసిన త‌రువాత మ‌ధు చందాన‌గ‌ర్ పోలీస్‌స్టేష‌న్‌లో లొంగిపోయాడు. అత‌నిపై హ‌త్య‌కేసు న‌మోదు చేశారు పోలీసులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here