సంవత్సరం క్రితం పెళ్ళి జరిగింది.. ప్రియుడితో హోటల్ లో ఉంటూ భర్తకు దొరికిపోయింది.. ఆ తర్వాత..!

ప్రియుడితో హోటల్ లో ఉన్న భార్య భర్తకు అడ్డంగా దొరికిపోయింది. కేవలం 14 నెలల క్రితమే ఆమెకు పెళ్ళి అయింది. ఇంతలోనే ఓ హోటల్ గదిలో ఉండడం.. భర్తకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోవడం జరిగిపోయాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని సహాన్ పూర్ లో చోటుచేసుకుంది.

జనవరి ఎనిమిదవ తేదీన హోటల్ రూమ్ లో ఓ వ్యక్తి తన భార్య లవర్ తో ఉండడాన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. ఈ ఘటన తర్వాత దాదాపు గంట పాటూ భర్త నడిరోడ్డులో హంగామా సృష్టించాడు. అంతలోనే ఆ అమ్మాయి లవర్ అక్కడి నుండి జారుకున్నాడు. చూస్తుండగానే వీధిలో జనాలు గూమికూడిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వచ్చి వారిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్కడే ఉన్న వారు వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో పెట్టేశారు.

హాషిమ్ పురా నివాసి అయిన సల్మాన్ నిఖా 14 నెలల క్రితం మొహమ్మద్ కూతురితో పెళ్ళి జరిగింది. పెళ్ళి జరిగిన నెల రోజులకు అతడి దగ్గర నుండి భార్యను తీసుకొని వెళ్ళిపోయారు అమ్మాయి కుటుంబ సభ్యులు. ఆమెను తీసుకొని రావడానికి సల్మాన్ ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ అమ్మాయి కుటుంబసభ్యులు ఆమెను సల్మాన్ తో పంపించలేదు.

సల్మాన్ కు ఏదో దాస్తున్నారు అన్న విషయమై అనుమానం ఉండేది. తాజాగా సల్మాన్ నీ భార్య ఓ హోటల్ లోకి వెళ్ళింది అని ఎవరో సమాచారం ఇచ్చారు. సల్మాన్ అక్కడికి వెళ్ళి చూడగా ఓ గదిలో నుండి భార్య, ఆమె ప్రియుడు బబ్లూ బయటకు వచ్చారు. దీంతో సల్మాన్ నడిరోడ్డు లోనే వీరంగం సృష్టించాడు. పోలీసులు అక్కడికి చేరుకొని భార్యాభర్తలను పోలీస్ స్టేషన్ కు తీసుకొని వెళ్ళారు. అయితే తాను వచ్చింది తన సోదరుడితో అని సల్మాన్ భార్య చెబుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here