ప్రేమించి, పెళ్లాడాడు: భార్య వివాహేత‌ర సంబంధం పెట్టుకున్న‌ద‌ని తెలిసి..రైలు కింద ప‌డి!

ఓ యువ‌తిని ప్రేమించి, పెళ్లి చేసుకున్నాడో యువ‌కుడు. త‌న ప్రేమ‌ను పెళ్లి దాకా తీసుకెళ్ల‌డానికి ఎదురైన అన్ని ఇబ్బందుల‌ను అధిగ‌మించాడు. మూడునెల‌ల కింద‌ట‌ ప్రేమించిన అమ్మాయి మెడ‌లో తాళి క‌ట్టాడు. ఆ త‌రువాత ఆమె నిజ‌స్వ‌రూపం తెలిసి..త‌ట్టుకోలేక‌పోయాడు.

త‌న‌తో ప్రేమగా ఉంటూనే, ఆమె మ‌రొక‌రికి శారీర‌కంగా ద‌గ్గ‌ర‌య్యింద‌ని తెలుసుకుని జీర్ణించుకోలేక‌పోయాడు. పెళ్ల‌యిన త‌రువాత కూడా ఆ వ్య‌క్తితో వివాహేత‌ర సంబంధాన్ని కొన‌సాగించ‌డాన్ని భ‌రించ‌లేక‌పోయాడు. రైలు కింద ప‌డి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. క‌ర్నూలులో చోటు చేసుకున్న విషాద‌క‌ర ఘ‌ట‌న ఇది. మృతుడి పేరు విన‌య్‌కుమార్‌.

క‌ర్నూలు కార్బైడ్‌ ఫ్యాక్టరీ స‌మీపంలో సోమవారం రాత్రి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అత‌ని స్వ‌గ్రామం గోనెగండ్ల‌. ఎంబీఎ చ‌దివాడు. త‌న తమ్ముడు వంశీకృష్ణతో కలసి పత్తికొండలో చిన్న వ్యాపారం చేస్తున్నాడు. వెల్దుర్తికి చెందిన‌ సౌజన్య అనే అమ్మాయిని ప్రేమించాడు.

మొద‌ట్లో రెండు కుటుంబాల్లోనూ అంగీక‌రించ‌క‌పోయిన‌ప్ప‌టికీ.. వారిని ఒప్పించి, నవంబర్‌ 1న పెళ్లి చేసుకున్నాడు. అప్పటికే మరొక యువకుడితో ఆమె ప్రేమలో ఉంది. పెళ్ల‌యిన త‌రువాత కూడా అత‌ణ్ణి మ‌రిచిపోలేక‌పోయింది. వినయ్‌కుమార్‌తో విడాకులు కావాలని గొడవ ప‌డుతుండేది. ఇదే విషయ‌మై ఇద్ద‌రి మ‌ధ్యా గొడ‌వ‌లు చోటు చేసుకుంటూండేవి.

ఈ గొడ‌వ‌ల వ‌ల్ల సౌజ‌న్య పుట్టింటికి వెళ్లింది. దీనితో తీవ్ర మనస్తాపం చెందిన వినయ్‌కుమార్ ప‌ని మీద క‌ర్నూలుకు వెళ్లాడు. కార్బైడ్ ఫ్యాక్ట‌రీ స‌మీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.

ఈ ఘ‌ట‌న‌పై రైల్వే పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. విన‌య్‌కుమార్ జేబులో ఉన్న కార్డుల ఆధారంగా అడ్ర‌స్ తెలుసుకుని, కుటుంబ స‌భ్యుల‌కు స‌మాచారం ఇచ్చారు. ఆత్మ‌హ‌త్య‌కు ముందు విన‌య్‌కుమార్ త‌న త‌మ్ముడు వంశీకృష్ణ వాయిస్ కాల్ పంపించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here