భార్యను పట్టుకొని వెక్కి వెక్కి ఏడుస్తున్న భర్త.. చివరికి కాళ్ళు కూడా పట్టేసుకున్నాడు.. ఎందుకు..!

భార్యను పట్టుకొని వెక్కి వెక్కి ఏడుస్తున్న ఓ భర్త వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తోంది. కంటి నిండా నీరు వెక్కి వెక్కి ఏడుస్తున్న అతడు చివరికి భార్య కాళ్ళు కూడా పట్టేసుకున్నాడు. ఇంతకూ ఎందుకో తెలుసా..? భార్య పుట్టింటికి వెళుతోందని.

భర్త మీద కోపంతో ఓ భార్య అన్నీ సర్దేసుకొని పుట్టింటికి వెళ్ళిపోడానికి సిద్ధమైంది. ఇంతలో స్టేషన్ దగ్గరకు ఆమె భర్త చేరుకున్నాడు. ఆమె తనకు చెప్పకుండా వెళ్ళిపోతోందని.. తాను వద్దన్నా పుట్టింటికి వెళుతోందని బాధపడిన అతడు వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టాడు. చివరికి ఆమె కాళ్ళు కూడా పట్టేసుకొని ఎక్కడికీ వెళ్ళొద్దు అని చెప్పాడు. నీకు ఏది ఇష్టమైతే అదే చేస్తాను.. దయచేసి ఎక్కడికీ వెళ్ళొద్దు అని భార్యను బ్రతిమలాడుతూ వేడుకుంటున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఏదో కుటుంబకలహాల కారణంగా ఆ యువతి పుట్టింటికి వెళ్ళబోతోందని వీడియో చూస్తే మనకు అర్థం అయిపోతుంది. చాలా సమయం వరకూ ఈ ఫ్యామిలీ డ్రామా అక్కడ జరిగినట్లు తెలుస్తోంది. భార్య అంటే ఎంత ప్రేమో అని ఈ వీడియో చూసిన నెటిజన్లు చెబుతూ ఉన్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here