క‌ట్టుకున్న భార్య‌ను కొట్టి చంపాడు..అత్తామామ‌ల‌కు కొత్త క‌థ చెప్పాడు!

క‌ట్టుకున్న భార్య‌ను దారుణంగా కొట్టి చంపాడో కిరాత‌కుడు. విచార‌ణ సంద‌ర్భంగా పోలీసులకు కొత్త క‌థ చెప్పాడు. హైబీపీతో చ‌నిపోయింద‌ని ఓ సారి, గుండెపోటుకు గురై మ‌ర‌ణించింద‌ని ఇంకోసారి.. ఇలా అవ‌లీల‌గా క‌ట్టుక‌థ‌లు వినిపించాడు. చివ‌రికి పోలీసుల చేతికి చిక్కాడు. ఈ ఘ‌ట‌న హ‌ర్యానాలోని య‌మునాన‌గ‌ర్ జిల్లాలో చోటు చేసుకుంది. హ‌తురాలి పేరు ముంతాజ్ బేగం.

జిల్లాలోని ఛిఛ్రౌలి గ్రామానికి చెందిన అస్గ‌ర్ భార్య ఆమె. 20 ఏళ్ల కింద‌ట అస్గ‌ర్‌ను వివాహం చేసుకుంది. వారికి ఇద్ద‌రు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. అద‌న‌పు క‌ట్నం కోసం త‌ర‌చూ వేధింపుల‌కు గురి చేస్తుండేవాడ‌ట‌. డ‌బ్బులు ఇవ్వ‌ని ప్ర‌తీసారి ముంతాజ్‌ను దారుణంగా కొట్టేవాడ‌ని ఆమె కుటుంబీకులు చెబుతున్నారు. గురువారం రాత్రి కూడా ఆమెతో గొడ‌వ ప‌డ్డాడు.

ఈ సంద‌ర్భంగా ఆమెను తీవ్రంగా కొట్టాడు. క‌ణ‌త‌కు దెబ్బ త‌గ‌ల‌డంతో ముంతాజ్ బేగం మ‌ర‌ణించింది. అనంత‌రం.. ఆమెను ఆసుప‌త్రికి త‌ర‌లించాడు అస్గ‌ర్‌. ముంతాజ్ బేగం త‌ల్లిదండ్రుల‌కు స‌మాచారం ఇచ్చి, పారిపోయాడు.

ఈ స‌మాచారం అందుకున్న వెంట‌నే ఆసుప‌త్రికి వెళ్లిన ముంతాజ్ త‌ల్లిదండ్రులు, సోద‌రుడికి ఆమె మృత‌దేహంగా క‌నిపించింది. వెంట‌నే ఛిఛ్రౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు మృత‌దేహాన్ని ప‌రిశీలించ‌గా.. ఒళ్లంతా దెబ్బ‌ల గుర్తులు క‌నిపించాయి. దీనితో మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్ట్‌మార్ట‌మ్ కోసం త‌ర‌లించారు. ప‌రారీలో ఉన్న అస్గ‌ర్ కోసం గాలిస్తున్నారు. అత‌నిపై హ‌త్యానేరం కింద కేసు న‌మోదు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here