భార్య మృత‌దేహంతో రాత్రంతా న‌గ్న‌పూజ‌లు: అత‌ను చెప్పిన కార‌ణం విని..షాక్‌

భువ‌నేశ్వ‌ర్‌: అనారోగ్యంతో ఓ మ‌హిళ మ‌ర‌ణించగా.. ఆ విష‌యాన్ని బ‌య‌టికి పొక్క‌నివ్వ‌లేదామె భ‌ర్త‌. త‌న భార్య మృత‌దేహాన్ని దాచి పెట్టాడు. అంత్య‌క్రియ‌లు చేసేది లేదంటూ భీష్మించాడు. ఎందుకు చేయ‌వంటూ నిల‌దీయ‌గా.. ఆ భ‌ర్త చెప్పిన కార‌ణం విని.. బంధువులు భ‌యంతో బిక్క‌చ‌చ్చిపోయారు.

 

ఎంత‌కీ ఏమా కార‌ణం? త‌న‌కు మంత్రాలు తెలుస‌ని, చ‌నిపోయిన భార్య‌ను తిరిగి బ‌తికించుకుంటాన‌ని చెబుతున్నాడు. ఈ ఘ‌ట‌న ఒడిశాలోని రాయ‌గ‌డ జిల్లాలో చోటు చేసుకుంది. మృతురాలి పేరు కుణి. త‌న భ‌ర్త ద‌శ‌ర‌థ నండ్రుక‌తో క‌లిసి జిల్లాలోని మునిగూడ బ్లాక్ ప‌రిధిలో ఉండే సిబ‌ప‌ద‌ర్ గ్రామంలో నివ‌సిస్తోంది.

కొద్దిరోజుల కింద‌ట ఆమె తీవ్ర అనారోగ్యానికి గురైంది. భార్య‌ను ఆసుప‌త్రికి తీసుకెళ్ల‌కుండా.. మంత్రాల‌తో న‌యం చేస్తాన‌ని చెప్పాడు. రాత్రిపూట ఇంట్లో ఏవేవో పూజ‌లు చేసేవాడు. ప‌రిస్థితి విష‌మించ‌డ‌తో గురువారం ఉద‌యం ఆమె మ‌ర‌ణించింది. ఈ విష‌యాన్ని ఎవ‌రికీ చెప్ప‌లేద‌త‌ను.

కుణి మృత‌దేహాన్ని ఇంట్లోనే దాచి ఉంచాడు. గురువారం రాత్రి నుంచి శుక్ర‌వారం తెల్ల‌వారు జాము వ‌రకూ పూజ‌లు చేశాడు. మృత‌దేహం ఒంటిపై దుస్తులు లేవ‌ని ప్ర‌త్య‌క్ష‌సాక్షులు చెబుతున్నారు. ఈ విష‌యం తెలుసుకున్న బంధువులు ద‌శ‌ర‌థ ఇంటికి చేరుకున్నారు. ద‌శ‌ర‌థ‌కు న‌చ్చ‌జెప్పి, కుణి మృత‌దేహానికి అంత్య‌క్రియ‌లు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here