భార్య అందంగా ఉంద‌ని..వేరొక‌రితో వివాహేత‌ర సంబంధం ఉంద‌ని..!

గ‌దగ్: క‌ట్టుకున్న భార్య‌పై ఏర్ప‌డిన అనుమానం ఆ భ‌ర్త‌ను రాక్ష‌సుడిగా మార్చింది. భార్య అందంగా ఉందంటూ న‌లుగురూ చెప్ప‌డాన్ని స‌హించ‌లేక‌పోయాడు. చివ‌రికి- వివాహేత‌ర సంబంధం పెట్టుకుంద‌ని కూడా సందేహించాడు.

దీనితో క‌ర్క‌శంగా మారిపోయాడు. భార్య‌ను క‌డ‌తేర్చాడు. ఆమె నిద్ర‌పోతున్న స‌మ‌యంలో.. దిండును ముఖం అదిమి పెట్టి, ఊపిరి ఆడకుండా చేసి, హ‌త‌మార్చాడు. ఈ దారుణ ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లోని గ‌ద‌గ్ జిల్లాలో చోటు చేసుకుంది.

హ‌తురాలి పేరు శివ‌లీల. ఆ కిరాత‌కుడి పేరు నాగ‌రాజు. కొద్దిరోజులుగా నాగ‌రాజు అకార‌ణంగా భార్య‌తో ఘ‌ర్ష‌ణ ప‌డుతుండేవాడు. ఆమెను కొట్టేవాడు. ఈ విష‌యం తెలిసిన త‌రువాత రెండు కుటుంబాల వారు నాగ‌రాజుకు స‌ర్ది చెప్పారు. రాజీ కుదిర్చారు.

అయిన‌ప్ప‌టికీ.. అత‌ను త‌న ప్ర‌వ‌ర్త‌న‌ను మార్చుకోలేదు. శ‌నివారం రాత్రి మ‌ద్యం సేవించి ఇంటికొచ్చిన నాగరాజు మ‌రోసారి శివ‌లీల‌తో గొడవ పెట్టుకున్నారు. ఘ‌ర్ష‌ణ ప‌డ్డాడు. భార్య‌ను చంపాలనుకున్నాడు.

నిద్ర‌పోతున్న భార్య ముఖంపై దిండు అదిమి పెట్టి, ఊపిరి ఆడ‌కుండా చేసి, హ‌త్య చేశాడు. తెల్లారిన త‌రువాత అత‌ను నేరుగా ల‌క్ష్మేశ్వ‌ర్ పోలీస్‌స్టేష‌న్‌కు వెళ్లి లొంగిపోయాడు. అత‌నిపై పోలీసులు కేసు న‌మోదు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here