ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు.. భార్యను 15 పీసులు చేశాడు..!

బళ్ళారి హోస్పేట ప్రాంతానికి చెందిన చంద్రహాస అనే వ్యక్తి భారతి(24) అనే అమ్మాయిని ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. అయితే అతనే భార్యను 15 ముక్కలుగా కత్తిరించి అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ఫిబ్రవరి 19న ఈ ఘటన చోటుచేసుకాగా చాలా ఆలస్యంగా విషయం బయటకు వచ్చింది.

ఏమి జరిగిందంటే
భర్త చంద్రహాస.. భార్య భారతితో చాలా రోజులుగా గొడవపడుతూ ఉన్నాడు. అందుకు కారణం కొత్త కారు కావాలని అడగడమే. ఫిబ్రవరి 19న ఆ గొడవ మరింత పెద్దది అయింది. ఆ గొడవలో చంద్రహాస భారతిని గట్టిగా కొట్టాడు. దీంతో ఆమె స్పృహ తప్పి పడిపోయింది. అయితే ఆమె మళ్ళీ పైకి లేస్తే ఎక్కడ గొడవ పెట్టుకుంటుందో అని భయపడి.. ఆమె గొంతు నులిమి హత్య చేసేశాడు. ఆమెను 15 భాగాలుగా కోసి.. వాటిని నాలుగు సంచుల్లో కుక్కి హోస్పేట రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న కాలువలో పడవేశాడు.

కొన్నేళ్ళ క్రితం చంద్రహాస గార్మెంట్ షాప్ లో పనిచేసేవాడు. భారతి కూడా అదే షాప్ లో పని చేసేది. వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. చివరికి వాళ్ళు పెద్దలను ఎదిరించి పెళ్ళి చేసుకున్నారు. ఆ తర్వాత అక్కడ ఉద్యోగం మానేసి ఇద్దరూ కొత్తగా షాప్ పెట్టి సంపాదిస్తూ ఉన్నారు. షాప్ కు దగ్గరలో ఇంటిని రెంట్ కి తీసుకొని ఉండే వాళ్ళు. ఫిబ్రవరి 19న ఈ ఘటన జరిగిన తర్వాత తన కుటుంబసభ్యులకు ఆమె తప్పిపోయిందని చెప్పి వెతకడం మొదలుపెట్టాడు. పోలీసులకు చెబితే పరువు పోతుందని వెతుకుతున్నట్లు నటించి చంద్ర హాస కూడా తప్పించుకొని వెళ్ళిపోయాడు. భారతి సోదరుడికి డౌట్ వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. వారు చంద్రహాస ను వెతికి పెట్టుకొని.. తమ స్టైల్ లో విచారించగా చంద్ర హాస జరిగిన ఘటనను బయటపెట్టాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here