భార్య పేరుతో ఫేస్‌బుక్ ఫేక్ ఐడీ..పోర్న్ పిక్స్ షేర్‌..సెక్సీ ఛాట్స్‌: ఇదీ ఓ భ‌ర్త ఘాతుకం

భార్య అంటే గిట్ట‌ని ఓ మ‌హానుభావుడు ఆమెకు నిద్ర లేకుండా చేశాడు. క‌ట్టుకున్న భార్య పేరుతో ఫేస్‌బుక్‌లో ఓ ఫేక్ ఐడీని క్రియేట్ చేశాడు. త‌న‌కు తెలిసిన వారికి, తెలియ‌ని వారికీ ఆ ఫేక్ ఐడీ ద్వారా పోర్న్ చిత్రాలు పోస్ట్ చేశాడు. ఆమె పేరుతోనే సెక్సీ ఛాట్స్ చేశాడు.

ఫేస్‌బుక్‌లోని త‌న ఒరిజిన‌ల్ అకౌంట్ నిండా అలాంటి పిక్స్ ఉండ‌టంతో బాధితురాలికి కంటి మీద కునుకు లేకుండా పోయింది. మొబైల్‌ఫోన్ నంబ‌ర్ అనుసంధానించి ఉండ‌టంతో ఫోన్‌లోనూ అవి డౌన్‌లోడ్ అయ్యేవి. దీనితో ఆమె తీవ్ర మ‌న‌స్తాపానికి గుర‌య్యేవారు.

ఇదంతా చేస్తోన్న‌ది త‌న భ‌ర్తే అని తెలిసిన త‌రువాత నిర్ఘాంత‌పోయారు. సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. శ్రీ‌కాకుళంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఆ భ‌ర్త పేరు శాంతి సృజ‌న్‌. శ్రీకాకుళంలోని ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్‌ మేనేజర్‌.

భార్య ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు శాంతి సృజన్‌ను సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. శాంతి సృజన్ విశాఖ‌ప‌ట్నానికి చెందిన వ్య‌క్తి. ప‌దేళ్ల కింద‌ట అత‌నికి పెళ్ల‌యింది. భార్య కూడా బ్యాంక్ ఉద్యోగే. హైద‌రాబాద్‌లో ఇండియ‌న్ ఓవ‌ర్‌సీస్ బ్యాంక్‌లో ప‌నిచేస్తున్నారు.

ఉద్యోగరీత్యా శాంతి సృజన్‌ శ్రీకాకుళంలో పనిచేస్తున్నాడు. ఆమెకు బదిలీ కాకపోవడంతో కొద్దినెలల నుంచి శాంతి సృజన్‌ ఒంటరిగా శ్రీకాకుళంలోనే ఉంటున్నాడు. ఈ కార‌ణంతోనే శాంతి సృజ‌న్ భార్య‌పై ధ్వేషం పెంచుకున్నాడు.

ఫేస్‌బుక్ ద్వారా అశ్లీల వీడియోలు, ఫొటోలు పంపిస్తూ, సెక్సీ ఛాట్స్ చేస్తూ ఇబ్బందుల‌కు గురి చేశాడు. దీనితో ఆమె సైబ‌రాబాద్ సైబ‌ర్‌క్రైమ్ పోలీసుల‌ను ఆశ్ర‌యించారు.

పోలీసులు చేప‌ట్టిన ద‌ర్యాప్తులో ఇదంతా చేస్తోన్న‌ది ఆమె భ‌ర్తేన‌ని తేలింది. దీనితో అత‌ణ్ణి పోలీసులు అరెస్టు చేశారు. భ‌ర్త మ‌న‌స్త‌త్వం ఇంత ఛండాలంగా ఉండ‌టంతో ఆమె విడాకుల కోసం ద‌ర‌ఖాస్తు చేశార‌ట‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here