ఏ భర్త కూడా అనకూడని మాట అన్నాడు ఇతడు.. పేరుకేమో డాక్టర్..!

అతడేమో డాక్టర్.. మూడు సంవత్సరాలు అయినా బిడ్డలు పుట్టడం లేదని.. తన భార్య మీద శాడిజాన్ని రుద్దేవాడు. అక్కడితో ఆగకుండా ఆమెకు బ్లూ ఫిలిమ్స్ చూపించి అసహజరీతిలో శృంగారంలో పాల్గొనమనేవాడు.. అంతేకాదు ఏ భర్త కూడా అనకూడని మాట.. తన తండ్రితో పడుకొని పిల్లలను కను అని అన్నాడంటే అతడు ఎంత నీచుడో అర్థం చేసుకోవచ్చు. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది.


డాక్టర్ మంజునాథ్ బెంగళూరు లోని విద్యారణ్యపురలో తన భార్య స్వాతి(పేరు మార్చాం), తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. మూడు సంవత్సరాల క్రితం మంజునాథ్ పెళ్ళి చేసుకున్నాడు. ఇప్పటివరకూ ఆమె గర్భవతి కాకపోవడంతో మంజునాథ్ ఆమెను హింసించడం మొదలుపెట్టాడు. అతడితో పాటూ ఆమె అత్తామామలు కూడా ఆమెను హింసించడం మొదలుపెట్టారు. దీంతో ఆమె బాధను భరించలేకపోయేది.

రాను రానూ మంజునాథ్ ఆగడాలు మరింత ముదిరిపోయాయి. అతడు చేసే పనులలో శాడిజం కొట్టొచ్చినట్లు కనిపించేది. బ్లూ ఫిలిమ్స్ చూపించి అసహజరీతిలో శృంగారంలో పాల్గొనమనేవాడు ఆమె ఒప్పుకోకపోవడంతో చిత్రహింసలకు గురిచేసేవాడు. అంతేకాకుండా తన తండ్రితో పడుకోమని చెప్పేవాడు మంజునాథ్. తనకు బిడ్డను అలాగైనా ఇవ్వమని నీచంగా మాట్లాడేవాడు. తన కండిషన్స్ ఒప్పుకోకపోవడంతో నీ నగ్నవీడియోలను సోషల్ మీడియాలో పెడుతానని బెదిరించేవాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. మంజునాథ్ చేసిన దురాగతాలను బయటపెట్టింది. తల్లిదండ్రులు, సోదరుడు కలిసి మెజిస్టిక్ లో ఉన్న తమ బిల్డింగ్ ను అమ్మించాలని చూస్తున్నారని ఆ మహిళ చెప్పుకొచ్చింది. ఇంకా కట్నం కావాలని కోరుతున్నారని ఆమె చెప్పుకొచ్చింది. మూడు నెలల క్రితమే పోలీసులను ఫిర్యాదు చేశామని వారు పట్టించుకోలేదని చెబుతోంది బాధిత మహిళ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here