బార్ గ‌ర్ల్‌ను ప్రేమించి, పెళ్లాడాడు! మ‌ద్యానికి బానిసైంద‌ని కొట్టి చంపాడు: ఆమె నిండు గ‌ర్భిణి కూడా!

ముంబై: ముంబైలో దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఎనిమిది నెల‌ల నిండు గ‌ర్భిణిని కొట్టి చంపాడు ఆమె భ‌ర్త‌. దీనికి అత‌ను చెప్పే కార‌ణం.. మ‌ద్యం. త‌న భార్య మ‌ద్యానికి బానిస‌గా మారినందు వ‌ల్లే తాను ఆమెను చంపాల్సి వ‌చ్చింద‌ని చెబుతున్నాడు. హ‌తురాలి పేరు మాయీ. గ‌తంలో బార్ గ‌ర్ల్‌గా ప‌నిచేస్తుండేది. నిందితుడి పేరు క‌ల్పేష్ థాక్రే.

 

త‌న భార్య‌తో క‌లిసి భివండీలో నివ‌సిస్తున్నాడు. త‌న భార్య క‌నిపించ‌ట్లేదంటూ ఈ నెల 12వ తేదీన ఆయ‌న గ‌ణేష్‌పురి పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్‌గా కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్న సమ‌యంలో.. తొమ్మిదిరోజుల త‌రువాత క‌ల్పేష్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. త‌న భార్య‌ను తానే హ‌త‌మార్చిన‌ట్లు చెప్పాడు.

 

గ‌తంలో బార్ గ‌ర్ల్‌గా ప‌ని చేసిన త‌న భార్య మాయీకి మ‌ద్యం అల‌వాటు ఉంద‌ని, రోజూ మితిమీరి మ‌ద్యం సేవిస్తుండేద‌ని క‌ల్పేష్ చెప్పాడు. ప్ర‌స్తుతం త‌న భార్య ఎనిమిది నెల‌ల గ‌ర్భ‌వతి అని, ఎక్కువ‌గా మ‌ద్యం తాగ‌డం వ‌ల్ల బిడ్డ‌కు ప్ర‌మాద‌మ‌ని తాను ప‌లుమార్లు చెప్పిన‌ప్ప‌టికీ, ఆమె ప‌ట్టించుకోలేద‌ని అన్నాడు.

 

బార్ గ‌ర్ల్‌గా ప‌నిచేస్తున్న స‌మ‌యంలో.. ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్న‌ట్లు చెప్పాడు. పెళ్లి త‌రువాత మ‌ద్యాన్ని మానుకుంటాన‌ని ఆమె మాట కూడా ఇచ్చింద‌ని అన్నాడు.

అయిన‌ప్ప‌టికీ.. ఆమె ఆ అల‌వాటును మానుకోక‌పోగా, మ‌రింత ఎక్కువ‌గా తాగ‌డానికి అల‌వాటు ప‌డింద‌ని చెప్పాడు. దీనితో ఈ నెల 12వ తేదీన ఆమెను హ‌త‌మార్చి, మృత‌దేహాన్ని ఇంట్టి ఆవ‌ర‌ణలోనే పాతి పెట్టాన‌ని అన్నాడు. పోలీసులు అత‌ణ్ని అరెస్టు చేసి, రిమాండ్‌కు త‌ర‌లించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here