శ్రీనివాస్ కూచిబొట్లను చంపిన వ్యక్తికి శిక్ష ఖరారు చేసిన అమెరికా కోర్టు..!

అమెరికా లోని కెన్సాస్ లో స్నేహితుడితో కలిసి బార్ కు వెళ్ళిన ఎన్నారై శ్రీనివాస్ కూచిభోట్ల పై అప్పట్లో అమెరికా మాజీ సైనికుడు కాల్పులు జరిపిన విషయాన్ని ఏ ఒక్క తెలుగు వ్యక్తి కూడా మరచిపోడు. అనవసరంగా అమెరికా గన్ కల్చర్ కు ఓ భారతీయుడు బలయ్యాడు అని బాధపడ్డవారు ఎందరో..! శ్రీనివాస్‌ ను హత్య చేసిన వ్యక్తికి యుఎస్ కోర్టు జీవిత ఖైదు విధిస్తున్నట్లు తీర్పును ఇచ్చింది. ప్యూరింగ్‌ టన్‌ శిక్షపై మాట్లాడిన న్యాయవాదులు 50 ఏళ్ల తర్వాత అతనికి పెరోల్‌ పై బయటకు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పారు. ఆడమ్‌ కు జీవిత ఖైదు విధించడాన్ని శ్రీనివాస్‌ భార్య సునయన ఆహ్వానించదగ్గ విషయంగా తెలిపారు.

గత ఏడాది ఫిబ్రవరి 22న స్నేహితుడితో కలసి బార్‌లో ఉన్న శ్రీనివాస్‌ పై అమెరికా నేవీ మాజీ సైనికుడు ఆడమ్‌ ప్యురిన్‌ టన్‌(52)..నా దేశం నుంచి వెళ్లిపోండి అంటూ కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన కూచిభొట్ల చికిత్స పొందుతూ ఆసుపత్రిలో ప్రాణాలు వదిలారు. శ్రీనివాస్‌ తో పాటు బార్‌ లో ఉన్న అలోక్‌ మాదసాని గాయాలతో బయటపడ్డారు. వీరిపై దాడిని అడ్డుకునేందుకు వచ్చిన ఇయాన్‌ గ్రిలట్‌ అనే వ్యక్తికి కూడా బుల్లెట్‌ గాయాలయ్యాయి. శ్రీనివాస్‌ హత్యపై అంతర్జాతీయ స్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తం అయ్యాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here