నంద‌మూరి న‌ట‌సింహం భుజానికి క‌ట్టు

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ భుజానికి స‌ర్జ‌రీ స‌క్సెస్ అయ్యింది. ఆయ‌న కుడిభుజానికి శ‌నివారం ఉద‌యం కాంటినెంట‌ల్ ఆసుప‌త్రిలో స‌ర్జ‌రీ చేశారు.

సోమవారం ఉదయం ఆయన ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి సినిమా షూటింగ్ స‌మ‌యంలో బాల‌కృష్ణ భుజం నొప్పితో బాధ‌ప‌డ్డారు.

 

అప్ప‌టి నుంచి ఆ నొప్పి అలాగే ఉంటూ వ‌చ్చింది. ఆయ‌న భుజం రొటేట‌ర్‌ను మార్చాల్సి ఉన్నందున‌.. కొంత విరామం తీసుకున్నారు.

ఆ నొప్పితోనే జైసింహ మూవీ కూడా పూర్తి చేశారు. త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్‌కు వెళ్ల‌డానికి స‌మ‌యం ఉన్నందున‌.. ఈ గ్యాప్‌లో భుజానికి శ‌స్త్ర చికిత్స చేయించుకున్నారు.

ఆర్థోపెడిక్ స‌ర్జన్ డాక్టర్ దీప్తి నంద‌న్ రెడ్డి, డాక్టర్ ఆశిష్ బాబుల్కార్ బాల‌కృష్ణ భుజానికి స‌ర్జరీ చేశారు. శ‌స్త్ర చికిత్స విజ‌య‌వంత‌మైంద‌ని, కొద్దిపాటి విశ్రాంతి తీసుకుంటే స‌రిపోతుంద‌ని డాక్ట‌ర్లు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here