సెల్‌ఫోన్‌లో పోర్న్ వీడియోలు చూడ్డానికి బానిసైన కుమారుడి చెయ్యి న‌రికేసిన తండ్రి!

హైద‌రాబాద్‌: సెల్‌ ఫోన్‌లో అదేప‌నిగా పోర్న్ వీడియోల‌ను చూస్తున్నాడ‌నే ఆగ్ర‌హంతో ఓ తండ్రి.. త‌న కుమారుడికి దారుణ శిక్ష విధించాడు. అత‌ని కుడి చేతిని న‌రికి అవ‌త‌ల పారేశాడు. హైదరాబాద్‌ పాతబస్తీలో చోటు చేసుకుంది ఈ ఘ‌ట‌న‌.

పాత‌బ‌స్తీ పహాడీషరీఫ్ పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలోని జల్‌పల్లి నివాసం ఉండే ఖయ్యుం ఖురేషి మాంసం వ్యాపారి. అత‌నికి ఇద్ద‌రు కుమారులు. పెద్ద కుమారుడు మహ్మద్‌ ఖురేషీ మ‌ధ్య‌లోనే బ‌డి మానివేశాడు. దీనితో అత‌ణ్ణి జ‌ల్‌ప‌ల్లిలోనే ఉండే కేబుల్ టీవీ కార్యాల‌యంలో చేర్చాడు. మ‌హ్మ‌ద్ ఖురేషీ సెల్ ఫోన్‌లో పోర్న్ వీడియోల‌ను చూడ‌టానికి అల‌వాటు ప‌డ్డాడు.

వాటికి బానిస అయ్యాడు. పోర్న్ వీడియోలు చూడ‌నిదే ఏమీ తోచని స్థితికి దిగ‌జారాడు. చివ‌రికి- కేబుల్ ఆఫీస్‌కు కూడా వెళ్ల‌కుండా పోర్న్ వీడియోల‌ను చూడ‌సాగాడు. దీన్ని గ‌మ‌నించిన ఖయ్యుం చాలాసార్లు అత‌ణ్ణి హెచ్చ‌రించాడు.

 

అయిన‌ప్ప‌టికీ.. వినిపించుకోలేదు. ఈ విష‌యంపై తండ్రి కొడుకుల మ‌ధ్య రోజూ ఇంట్లో గొడవ జరుగుతుండేది. సోమవారం కూడా మ‌రోసారి గొడ‌వ ప‌డ్డారు వారిద్ద‌రు.

ఈ సంద‌ర్భంగా ఖయ్యూం ఆగ్రహంతో మాంసం నరికే కత్తితో కుమారుడి కుడి చేతిని నరికేశాడు. దీన్ని గ‌మ‌నించిన తల్లి స్థానికుల సాయంతో కుమారుడిని ఉస్మానియా ఆసుప‌త్రికి త‌ర‌లించింది. అనంత‌రం ఖయ్యుం ప‌హాడీష‌రీఫ్ పోలీస్‌స్టేష‌న్‌లో లొంగిపోయాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here