న్యాయం కోసం వెళ్లాల్సింది కోర్టుకు..టీవీ స్టూడియోల‌కు కాదు! శ్రీ‌రెడ్డికి ప‌వ‌న్ చుర‌క‌

హైద‌రాబాద్‌: కాస్టింగ్ కౌచ్ విష‌యంలో తెలుగు ఫిల్మ్ ఇండ‌స్ట్రీని ఓ ఉతుకు ఉతికి ఆరేసిన శ్రీ‌రెడ్డి వ్య‌వ‌హారంలో ప్ర‌ముఖ న‌టుడు, జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ మొద‌టిసారిగా నోరు విప్పారు. చిత్ర ప‌రిశ్ర‌మలో అన్యాయం జ‌రిగితే పోలీస్‌స్టేష‌న్‌కు వెళ్లాలి, అంతేగానీ టీవీ స్టూడియోలు, ఛాన‌ళ్ల కార్యాల‌యాల‌కు వెళ్తే న్యాయం జ‌ర‌గ‌ద‌ని ఎద్దేవా చేశారు.

న్యాయం చేయ‌డానికి కోర్టులు ఉన్నాయి..పోలీస్‌స్టేష‌న్లు ఉన్నాయి. అక్క‌డికి వెళ్తేనే న్యాయం జ‌రుగుతుంది. అన్యాయం జ‌రిగింద‌ని టీవీ స్టూడియోల్లో వెళ్లి కూర్చుంటే ఫ‌లితం ఉండ‌దు..` అని ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆమెకు చుర‌క‌లు అంటించారు. ప‌రిశ్ర‌మ‌లో అన్యాయానికి గురైన వారిని ఆదుకోవ‌డానికి తాను ముందుంటాన‌ని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here