ఫుల్లుగా తాగేసి..ఇన్నోవాను న‌డిపి..బీభ‌త్సం సృష్టించిన స‌ర్కిల్ ఇన్‌స్పెక్ట‌ర్

నీతులు చెప్పి..గోతిలో ప‌డ్డారనే సామెత‌ను నిజం చేశారు హైద‌రాబాద్ సిటీ పోలీసులు. మ‌ద్యం తాగితే..ముప్పతిప్ప‌లు పెట్టే పోలీసాయ‌నే త‌ప్ప‌తాగి కారును డ్రైవ్ చేశాడు.

 

 

అక్క‌డితో ఊరుకోక‌.. మ‌ద్యం మ‌త్తులో క‌నిపించిన వాహనాన్ని క‌నిపించిన‌ట్టే ఢీ కొట్టేశాడు. ఈ ఘ‌ట‌న ముగ్గురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. వారిలో ఒక‌రి ప‌రిస్థితి ఆందోళ‌న‌కరంగా ఉంది.

హైదరాబాద్ శివార్ల‌లోని యాప్రాల్‌లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఆ పోలీసాయ‌న పేరు గిరీశ్ నారాయ‌ణ రావు. హైదరాబాద్ రేంజ్‌లో సీఐగా ప‌నిచేస్తున్నారు.

కౌకూర్ మీదుగా యాప్రాల్ శైలి గార్డెన్‌లోని తన ఇంటికి వెళ్తున్న స‌మ‌యంలో ఆయ‌న ఇన్నోవా కారు అదుపు త‌ప్పింది. హనుమాన్ దేవాలయం వ‌ద్ద ప్ర‌మాదానికి గురైంది.

మూడు బైక్‌లు, ఓ ఆటోను ఢీ కొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో ముగ్గురు గాయ‌ప‌డ్డారు. వారిని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. మ‌ద్యం మ‌త్తులో ఉన్న ఆయ‌న వేగంగా కారు నడప‌డం వ‌ల్లే ప్ర‌మాదం సంభ‌వించింద‌ని నిర్ధారించారు. ఓ బైక్‌పై భిక్షపతి, సత్యలక్ష్మి అనే దంప‌తులు ఉన్నారు. వారిలో భిక్ష‌ప‌తి తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. వారిని ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here