ఎస్ఆర్ న‌గ‌ర్ పోలీస్‌స్టేష‌న్‌లో టీవీ న‌టి అంజ‌లి!

టీవీ న‌టి అంజలి గురువారం సాయంత్రం ఎస్ఆర్ న‌గ‌ర్ పోలీస్‌స్టేష‌న్‌లో క‌నిపించారు. త‌న సోద‌రుడి భార్య త‌ర‌ఫు బంధువులు ఫిర్యాదు చేయ‌డంతో పోలీసులు ఆమెను పోలీస్‌స్టేష‌న్‌కు పిలిపించారు. అంజ‌లితో పాటు ఆమె సోద‌రుడు వెంక‌టేశ్‌, ఆయ‌న భార్య దివ్య పోలీస్‌స్టేష‌న్‌కు వ‌చ్చారు. త‌మ కుమార్తె క‌నిపించ‌ట్లేదని, దీనికి కార‌ణం టీవీ నటి అంజ‌లి, ఆమె సోద‌రుడే కార‌ణ‌మంటూ దివ్య త‌ల్లిదండ్రులు రెండురోజుల కింద‌ట ఎస్ఆర్ న‌గ‌ర్ పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు.

నిజానికి- వెంక‌టేశ్‌, దివ్య ప్రేమికులు. బ‌ల్కంపేట్ ఆర్య స‌మాజ్‌లో వారు పెళ్లి చేసుకున్నారు. ప్రేమ పెళ్లికి త‌న ఇంట్లో వాళ్లు అంగీక‌రించ‌క‌పోవ‌డంతో.. వెంక‌టేశ్‌తో క‌లిసి ఆర్య‌స‌మాజ్‌లో పెళ్లి చేసుకున్నాన‌ని, తామిద్ద‌రం మేజ‌ర్ల‌మ‌ని దివ్య పోలీసుల‌కు వివ‌ర‌ణ ఇచ్చారు.

అంజ‌లితో స‌హా పోలీస్‌స్టేష‌న్‌కు వ‌చ్చిన వెంక‌టేశ్‌, దివ్య తాము ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నామని, తమను ఎవరూ కిడ్నాప్‌ చేయలేదని పోలీసుల ముందు చెప్పారు. ప్రేమ పెళ్లి చేసుకున్న యువతీ, యువకులిద్దరూ యుక్త వయస్సు వచ్చినవారని, వారి ఇష్టప్రకారం పెళ్లి చేసుకునే హక్కు మేజర్లకు ఉంటుందన్నారు. దివ్య త‌ల్లిదండ్రుల‌కు కౌన్సెలింగ్ ఇస్తామ‌ని అన్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here