మ‌ర్డ‌ర్ కేస్‌లో ట్విస్ట్‌! త‌న ప్రియురాలు వేరొక‌రితో స‌న్నిహితంగా ఉంటోంద‌నే అనుమానంతో..!

పెళ్లికి నిరాక‌రించింద‌నే కార‌ణంతో ఓ యువ‌తిని ఆమె స్నేహితుడు దారుణంగా హ‌త్య చేసిన ఘ‌ట‌న ఓ ట్విస్ట్ వెలుగులోకి వ‌చ్చింది. త‌న ప్రియురాలు వేరొక‌రితో స‌న్నిహితంగా ఉంటోంద‌నే అనుమానంతోనే నిందితుడు.. త‌న ప్రియురాలిని గొంతు కోసి హ‌తమార్చాడ‌ని పోలీసులు చెబుతున్నారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు.

రంగారెడ్డి జిల్లా శంక‌ర్‌ప‌ల్లి స‌మీపంలోని ప్ర‌గ‌తి రిసార్ట్స్‌లో శిరీష అనే డిగ్రీ విద్యార్థిని దారుణ‌హ‌త్య‌కు గురైన విష‌యం తెలిసిందే. ఆమె ప్రియుడు సాయిప్రసాద్‌ ఈ దారుణానికి పాల్పాడ్డాడు. కొంతకాలంగా శిరీష, సాయి ప్రసాద్‌ ప్రేమించుకుంటున్నారు. ఇటీవల శిరీష మరో యువకుడితో సన్నిహితంగా ఉంటోందని అనుమానం పెంచుకున్నాడు.

ఈ విషయమై ఇద్ద‌రి మధ్య కొంతకాలంగా గొడ‌వ‌ నడుస్తోంది. శిరీషపై కోపం పెంచుకున్న సాయిప్రసాద్ ఆమెను హ‌త్య చేయ‌డానికి ప‌థ‌కం ప‌న్నాడు. ఆమెను ప్రగతి రిసార్ట్‌కు పిలిచాడు. కాటేజీ బుక్‌ చేసుకొని ఏకాంతంగా గడిపినట్టు సమాచారం. అనంతరం ఆమెతో ఘ‌ర్ష‌ణ ప‌డ్డాడు.

తనను మోసం చేస్తున్నావ‌ని అంటూ సాయిప్రసాద్‌ శిరీష గొంతు కోసి హత్య చేసి పరారయ్యాడు. హత్య విషయం బయటకు పొక్కితే ఇబ్బందులు ఎదురవుతాయని భావించిన రిసార్ట్‌ యాజమాన్యం ఈ హ‌త్యోదంతాన్ని విషయాన్ని గోప్యంగా ఉంచే ప్రయత్నం చేసింది.

ఈ స‌మాచారం పోలీసులు తెలియ‌డంతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. చేవెళ్ల ఆసుప‌త్రికి త‌ర‌లించారు. పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఈ ద‌ర్యాప్తు సంద‌ర్భంగా అస‌లు విష‌యం వెలుగులోకి వ‌చ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here