మీ ఇంట్లో అమ్మాయిని మావాడు రేప్ చేశాడు.. మా ఇంటి మహిళను మీ ఇంట్లో మగాళ్ళు ఏమైనా..!

ఇంత ఘోరమైన తీర్పు ఓ పంచాయతిలో ఇచ్చారు. ఓ యువతిని రేప్ చేసిన వ్యక్తి మీద పంచాయతి పెట్టగా.. కావాలంటే రేప్ చేసిన ఇంట్లో ఉన్న ఆడపిల్లను ఎత్తుకొని వెళ్ళమని తీర్పు నిచ్చారు. వారు తీర్పు చెప్పినట్లుగానే అక్కడి వారు ప్రవర్తించారు. ఈ మృగాళ్ళ చర్య పాకిస్థాన్ లో చోటుచేసుకుంది.

ఓ యువతి అత్యాచారానికి గురైతే, ఆమె కుటుంబ సభ్యులు పంచాయితీ పెట్టిన వేళ, నిందితుడి కుటుంబం, తమ ఇంటి ఆడపిల్లను పంపుతామని, బాధితురాలి సోదరుడు రేప్ చేసుకోవచ్చన్న అసాధారణ ప్రతిపాదనతో వచ్చింది. దీనికి బాధితురాలి కుటుంబం కూడా నిస్సంకోచంగా అంగీకరించింది. తోబాతెక్ సింగ్ అనే గ్రామంలో జరిగింది. తొలి అమ్మాయిని ఏ గదిలో ఎక్కడ రేప్ చేశారో అదే గదిలోకి పంపారు రెండు కుటుంబాల పెద్దలు.

లాహోర్ కు 172 మైళ్ళ దూరంలో జరిగిన ఈ రివెంజ్ రేప్ ఘటన ఆలస్యంగా పోలీసుల వద్దకు చేరింది. మార్చి 20న ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. వసీం అనే వ్యక్తి 16 ఏళ్ల అమ్మాయిని రేప్ చేశాడని పంచాయతి పెట్టారు.. అందరూ వసీం ను చంపేయమని అన్నారు. కానీ వసీం కుటుంబ సభ్యులు తమ కుటుంబంలో ఉన్న ఎవరైనా మహిళను కావాలనుకుంటే రేప్ చేయొచ్చని చెప్పడంతో వసీం ఆడపడుచు అయిన 40 ఏళ్ల మహిళను తీసుకొని వెళ్ళి రేప్ చేసేశారు. ఈ ఘటన అనంతరం ఇరు కుటుంబాలకు చెందిన వాళ్ళు ఎవరూ కక్ష్య సాధింపు చర్యలకు దిగమని, జరిగిన ఘటనను మరచిపోతామని లిఖితపూర్వక హామీలు తీసుకున్నారట. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు 10 మందిని పైగా అరెస్ట్ చేశారు. ఇలాంటి రివెంజ్ రేప్ శిక్షలు పాకిస్థాన్ లోని కొన్ని ప్రాంతాల్లో సర్వ సాధారణమట.. కొన్ని దశాబ్దాలుగా అక్కడి పంచాయతీల్లో ఇలాంటి తీర్పునే ఇస్తూ ఉంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here