అదే జరిగితే షర్ట్ విప్పి తిరుగుతానని చెప్పిన కోహ్లీ..!

విరాట్ కోహ్లీ.. అతడి ట్యాలెంట్ ను ఎవరూ తప్పు పట్టరు. ఎందుకంటే ఏ ఫార్మాట్ లో అయినా తన క్లాస్ తో అలరిస్తూ ఉంటాడు. ప్రస్తుతం కోహ్లీ ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ సారి మాత్రం కప్ పక్కా అని అంటున్నాడు. అయితే ఐపీఎల్ ప్రారంభానికి ముందు జరిగిన ఓ ఇంటర్వ్యూలో గంగూలీ షర్ట్ విప్పిన ఘటనను కోహ్లీ గుర్తు చేసుకున్నాడు. తాను షర్ట్ విప్పడానికి రెడీ అని అయితే అది ఎప్పుడంటే.. భారత్ వచ్చే వన్డే ప్రపంచ కప్ గెలిచాకనే అట..!

వచ్చే ఏడాది జరగనున్న ప్రపంచకప్‌లో భారత్ విజయం సాధిస్తే తాను చొక్కా విప్పేసి ఆక్స్‌ఫర్డ్ వీధుల్లో నడుస్తానని పేర్కొన్నాడు. రెండు దశాబ్దాల క్రితం ఇంగ్లండ్‌లో జరిగిన నాట్‌వెస్ట్ ట్రోఫీ ఫైనల్‌లో భారత్ గెలిచినప్పుడు అప్పటి కెప్టెన్ సౌరవ్ గంగూలీ చొక్కా తీసేసి మైదానంలో తిరిగాడు. బొరియా మజుందార్ రాసిన ‘ఎలెవన్ గాడ్స్ అండ్ బిలియన్ ఇండియన్స్’ పుస్తక ప్రారంభోత్సవంలో గంగూలీ మాట్లాడుతూ నాటి ఘటనను గుర్తు చేసుకున్నాడు. ‘‘కెమెరాలు సిద్ధంగా పెట్టుకోండి. వచ్చే ప్రపంచకప్‌లో భారత్ గెలిస్తే కోహ్లీ కూడా షర్టు విప్పేసి తన సిక్స్‌ప్యాక్‌ను చూపిస్తూ ఆక్స్‌ఫర్డ్ వీధుల్లో నడుస్తాడు. ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదు’’ అని పేర్కొన్నాడు. దీనికి కోహ్లీ కోడా సరే అని చెప్పాడు.. ఇంగ్లండ్ ఆతిథ్యం ఇవ్వనున్న ప్రపంచకప్‌ను భారత్ గెలిస్తే చొక్కా విప్పేసి ఆక్స్‌ఫర్డ్ వీధుల్లో తిరుగుతానని తేల్చి చెప్పాడు. అక్కడితో ఆగకుండా, తానొక్కిడినే చొక్కా విప్పనని.. హార్దిక్ పాండ్యా, జస్ప్రిత్ బుమ్రాలు కూడా తనతో నడుస్తారని, ఇది 120 శాతం నిజమంటూ నవ్వులు పూయించాడు. బుమ్రాకు కూడా సిక్స్ ప్యాక్ ఉందని, తమతోపాటు మరికొందరు కూడా షర్టులు తీసేస్తారని కోహ్లీ చెప్పడంతో అందరూ నవ్వుకున్నారు.

ఈరోజు రాత్రి 8 గంటలకు కోహ్లీ ఐపీఎల్ సమరం మొదలుకాబోతోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు.. కోల్ కతా నైట్ రైడర్స్ తో తలపడనుంది. ఈడెన్ గార్డెన్స్ లో మ్యాచ్ జరగనుంది. ఇప్పటిదాకా కోహ్లీ ఖాతాలో ఒక్క ఐపీఎల్ టైటిల్ కూడా లేదు. ఈసారైనా కప్ కొడతాడా అని అభిమానులు ఎదురుచూస్తూ ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here