బూప్రొఫెన్ ట్యాబ్లెట్లు వాడడం వలన మగవాళ్లకు ఇబ్బందే..!

ఐ బూప్రొఫెన్ ట్యాబ్లెట్లు పదే పదే తీసుకునే మగవాళ్ళకు చాలా ఇబ్బందులట.. ఇది ఏకంగా మగవారి సంతానోత్పత్తి మీద ప్రభావం చూపుతుందట. ఇటీవల చేసిన పరిశోధనల్లో ఇది తేలింది. ఐ బూప్రొఫెన్ ట్యాబ్లెట్లు ఎక్కువగా వాడిన మగవారిలో సంతానోత్పత్తి బాగా తగ్గిందట.

రోజుకు ఆరు ట్యాబ్లెట్లు వాడుతున్న వారిలో సెక్స్ హార్మోన్లు విపరీతంగా తగ్గిపోయాయని అవే సంతానోత్పత్తి తగ్గడానికి ముఖ్య కారణమని వారు తెలిపారు. అధికంగా వీటిని ఉపయోగించడం వలన అంగస్తంభన మీద కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని.. మజిల్ లాస్ తో పాటు డిప్రెషన్ కు కూడా కారణం అవుతాయని వారు చెప్పారు. 18 నుండి 35 వయసు గల మగవారికి వీటి వలన ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిసింది. హార్మోన్లు సరిగా పనిచేయకపోవడం వలన ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయని వారు తెలిపారు.

వీటిని ఎక్కువగా తీసుకోవడం వలన అలసట అనేది చాలా త్వరగా వస్తుందని తెలిపారు. మగవారిలో సంతానోత్పత్తి ఇటీవలి కాలంలో బాగా తగ్గిందట అందుకోసం పరిశోధనలు నిర్వహించగా.. ఈ షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. గత 40 సంవత్సరాల్లో మగవారిలో స్పెర్మ్ కౌంట్ బాగా తగ్గడంతో సంతానోత్పత్తి విషయంలో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here