గల్లీ క్రికెట్ వీడియోను పోస్ట్ చేసిన ఐసీసీ.. బ్యాట్స్మెన్ అవుటా-కాదా..?

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేసింది. అదేదో సెలెబ్రిటీలు ఆడిన గేమ్ గురించి కాదు. ఓ గల్లీ క్రికెట్ మ్యాచ్..! హమ్జా అనే ఫ్యాన్ ఓ వీడియోను తమకు పంపించాడని.. అది అవుటా-కాదా అని తమను అడిగాడని ఐసీసీ తెలిపింది.

ఇంతకూ ఆ వీడియోలో ఏమి ఉందంటే.. ఓ వ్యక్తి బలంగా బంతిని బాదుతాడు. అయితే అది భారీగా టర్న్ అయి గింగిరాలు తిరుగుతూ బ్యాట్మెన్ కాళ్ళ కింద నుండి దూరి వికెట్లకు తగులుతుంది. మొదట ఆ బ్యాట్మెన్ తాను నాటౌట్ అని చెప్పి అడుగుతాడు. కానీ అక్కడ ఉన్న తర్వాతి బ్యాట్స్మెన్ బ్యాటును లాక్కొంటాడు. పాపం అతన్ని చూస్తే అందరికీ బాదేస్తుంది. అయితే ఈ వీడియోను చూసిన ఐసీసీ కూడా ఇది అవుటా కాదా అని నెటిజన్లను ప్రశ్నించింది. దీనిపై చాలా మంది చాలా రకాలుగా కామెంట్లు చేశారు. కొందరు అవుట్ అని.. మరి కొందరు నాటౌట్ అని చెప్పారు. అయితే ఐసీసీ కూడా దీన్ని అవుట్ అనే స్పష్టం చేసింది.

ఐసీసీ 32.1 లా ప్రకారం ఇది అవుట్.. ఎందుకంటే బౌలర్ వేసిన బంతి నో బాల్ కాదు.. అలాగే బంతి డెలివరీ అయిన తర్వాత ఎట్టి పరిస్థితి లోనూ వేరే వారికి తగలడం కానీ జరగలేదు కాబట్టి ఇది ఖచ్చితంగా అవుటేనని తేలింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here