పోలీస్ స్టేషన్ మేడ మీద రొమాన్స్ తో రెచ్చిపోయిన జంట.. వీడియో చూసి పోలీసులు ఏమన్నారంటే..!

పోలీస్ స్టేషన్ పైన ఎవరైనా రొమాన్స్ చేస్తారా చెప్పండి.. కానీ విదేశీయులు ఏకంగా ఆ పనే చేసేశారు. ఆ ఘటనను కొందరు రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ అయిపోయింది. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఇంత జరిగినా పోలీసులు సైలెంట్ గా ఉన్నారు.. వారు ఏమన్నారంటే విదేశీయులకు ఇదంతా కామన్ మనం పట్టించుకోకూడదు అని..! ఫారిన్ టూరిస్టులు ఎక్కువగా వచ్చే ఉదయ్‌పూర్‌లో ఇవన్నీ కామన్ అంటూ గోయల్ తేలిగ్గా తీసుకున్నారు. ఆ వీడియోలో భారతీయులెవరూ కనిపించలేదు. పోలీసులెవరూ ఆ వీడియో తీయలేదు. అలాంటప్పుడు వారిపై చర్యలెలా తీసుకుంటాం. అయినా ఆ వీడియో క్లియర్‌గా లేదు. అని పోలీసులు అనేశారు.

ఉదయ్‌పూర్లోని ఘంటాఘర్ పోలీస్ స్టేషన్ మేడ మీద విదేశీ జంట రొమాన్స్ లో మునిగి పోయారు. అదే ప్రాంగణంలో ఆలయం మెట్ల మీది నుంచి వారు ఏకాంతంగా గడుపుతున్న దృశ్యాలను వీడియో తీశారు. హోళీ సందర్భంగా భాంగ్ ఆ ప్రాంతంలో ఇస్తూ ఉంటారు.. ఆ సమయంలో ఆ వీడియోను తీసిన కొందరు సోషల్ మీడియాలో పెట్టారు.

‘‘సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్న ఆ వీడియోలను నమ్మడం ఎలా..? వారిద్దరూ ముద్దులతో, కౌగిలింతలతో రొమాన్స్ చేసుకుంది ఘంటాఘర్ పోలీస్ స్టేషన్ మీదే అని ఎలా చెప్పగలరు..? వీడియో కనిపిస్తోన్న జంట విదేశీయులు. ఇలా రొమాన్స్ చేసుకోవడం వాళ్లకు కామన్. కాబట్టి వారిపై కేసు పెట్టలేం’’ అని ఉదయ్‌పూర్ రాజేంద్ర ప్రసాద్ గోయల్ అన్నారు. పోలీసులు దీనిపై అంతర్గత విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here