ఆసుప‌త్రిలో క‌న్నుమూసిన త‌ల్లి: ఆ విష‌యం తెలియ‌క మృత‌దేహం ప‌క్క‌నే నిద్ర‌పోయిన కుమారుడు!

క‌న్నీళ్లు తెప్పించే ఉదంతం ఇది. హృద‌యాల‌ను ద్ర‌వింప జేసే సంఘ‌ట‌న ఇది. త‌న త‌ల్లి చ‌నిపోయింద‌నే విష‌యం ఆ కుమారుడికి తెలియ‌దు. రాత్ర‌యింది. ఆ బాబుకు నిద్ర ముంచుకొస్తోంది. ఆసుప‌త్రిలో మంచం మీద త‌ల్లి నిద్ర‌పోతోంద‌ని అనుకున్నాడు. ఆమెను లేపాడు. లేవ‌లేదు.

ఎంత సేపు పిలిచినా త‌ల్లి నిద్ర లేవ‌క‌పోవ‌డంతో.. ఆమెను పిలుస్తూనే తానూ నిద్ర‌పోయాడు. ఆసుప‌త్రి మంచం మీద.. త‌ల్లి మృత‌దేహాన్ని ఆనుకుని ప‌డుకున్నాడు. హైద‌రాబాద్ ఉస్మానియా ఆసుప‌త్రిలో చోటు చేసుకుంది ఈ ఘ‌ట‌న. ఆ త‌ల్లి పేరు స‌మీనా సుల్తానా. హైద‌రాబాద్ పాత‌బ‌స్తీకి చెందిన సుల్తానా గుండె సంబంధిత ఇబ్బందుల‌తో ఉస్మానియా ఆసుప‌త్రిలో చేరారు.

అక్క‌డ చికిత్స పొందుతూ క‌న్నుమూశారు. ఆ విష‌యం ఆమె కుమారుడికి తెలియ‌దు. త‌ల్లిని లేపాడు. ఆమె నిద్ర మేల్కొన‌క‌పోవ‌డంతో త‌ల్లి మృత‌దేహం ప‌క్క‌నే ప‌డుకున్నాడు.

తెల్ల వారిన త‌రువాత గానీ.. ఆసుప‌త్రి సిబ్బందికి ఈ విష‌యం తెలియ‌దు. తెలిసిన త‌రువాత అంద‌రి హృద‌యాలు బ‌రువెక్కాయి. హెల్పింగ్ హ్యాండ్స్ అనే స్వ‌చ్ఛంద సంస్థ ఈ విషయాన్ని తెలుసుకుని ఆ బాలుడికి స‌హాయం అందించ‌డానికి ముందుకొచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here