ఓ కారు ఇంకో కారును ఢీ కొట్టింది.. ఆ కారు వెళ్లి ఇంకో కారుపై ప‌ల్టీ! ఊపిరి బిగ‌బ‌ట్టే ట్విస్ట్

మితిమీరిన వేగంతో ఓ కారు ఇంకో కారును ఢీ కొట్టింది.. ఆ కారు వెళ్లి ఇంకో కారుపై ప‌డింది. కాస్త క‌న్‌ఫ్యూష‌న్‌గానే ఉన్న‌ప్ప‌టికీ.. ఇందులో ఉన్న ట్విస్ట్ ఊపిరి బిగ‌బ‌ట్టేలా చేస్తుంది. ఈ మూడు కార్ల‌ల్లో ఏ ఒక్క‌రు కూడా గాయ‌ప‌డ‌లేదు. షాక్‌కు గుర‌య్యారంతే. ఈ ఘ‌ట‌న ఉక్రెయిన్ రాజ‌ధాని కీవ్‌లో చోటు చేసుకుంది.

ఈ నెల 20వ తేదీన మ‌ధ్యాహ్నం చోటు చేసుకున్న ఘ‌ట‌న ఇది. అప్పుడే భారీ వ‌ర్షం కురిసి, కాస్త తెర‌పి ఇచ్చిన‌ట్టుంది. ట్రాఫిక్ సిగ్న‌ళ్లు లేని నాలుగు రోడ్లు జంక్ష‌న్‌లో మితి మీరిన వేగంతో దూసుకొచ్చిందో బీఎండ‌బ్ల్యూ. ఇంకో వైపు నుంచి వ‌స్తోన్న ఓ కారును అడ్డంగా ఢీ కొట్టింది. దీనితో అది వెళ్లి.. రోడ్డు ప‌క్క‌న ఆగి వున్న ఇంకో కారుపై ప‌ల్టీ కొట్టింది. నేల మీదికి వాలిపోయింది.

ఈ ఘ‌ట‌న‌లో ఢీ కొట్టిన బీఎండ‌బ్ల్యూ కారులో గానీ, ప‌ల్టీ కొట్టిన కారులో గానీ, మీద ప‌డ్డ కారులో గానీ.. ఎవ్వ‌రూ గాయ‌ప‌డ‌లేదు గానీ.. ఆ మీద ప‌డ్డ కారులో ఉన్న ఓ చిన్న పిల్లాడు మాత్రం కాస్త షాక్‌కు గురైన‌ట్టున్నాడు. బీఎండ‌బ్ల్యూలో న‌లుగురు ఉండ‌గా.. ప‌ల్టీ కొట్టిన కారులో డ్రైవ‌ర్ మాత్ర‌మే ఉన్నాడు. మీద ప‌డ్డ కారులో ఓ కుటుంబం ప్ర‌యాణిస్తోంది. ఈ ఘ‌ట‌న మొత్తం అక్క‌డ అమ‌ర్చిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డ‌య్యింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here