జూన్ 16, 2019.. తేదీ గుర్తుపెట్టుకోండి..!

భారత్-పాకిస్థాన్ మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాల దృష్ట్యా ఇరు దేశాలు క్రికెట్ సిరీస్ లు ఆడడం లేదు. ఎప్పుడైనా వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ లాంటి టోర్నీలలో మాత్రమే తలబడుతూ ఉంటాయి. అయితే భారత్-పాకిస్థాన్ మరోసారి తలబడే రోజు దగ్గరకు వచ్చింది. అది జూన్ 16, 2019.. ఐసీసీ ప్రపంచకప్ లో భాగంగా ఆ రోజు భారత్-పాకిస్థాన్ జట్లు తలబడబోతున్నాయి.

లోధా కమిటీ చేసిన సూచనల మేరకు ఐపీఎల్ ఫైనల్ తరువాత ఇంటర్నేషనల్ మ్యాచ్ లకు 15 రోజుల విరామం ఇవ్వాల్సి వుండటంతో భారత్ ఆడే మ్యాచ్ ల తేదీలలో మార్పు వచ్చింది. దీంతో తొలుత అనుకున్న జూన్ 2న కాకుండా, జూన్ 5న భారత్ తన తొలి మ్యాచ్ ని దక్షిణాఫ్రికాతో ఆడుతుంది. ఇక చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ పై ఇండియా జూన్ 16న తలపడనుంది. రౌండ్ రాబిన్ ఫార్మాట్లో మ్యాచ్ లు సాగనుండగా, అన్ని జట్లు అందరితో తలపడనున్నాయి. 1992 తరువాత వరల్డ్ కప్ పోటీలు రౌండ్ రాబిన్ ఫార్మాట్ లో జరగడం ఇదే తొలిసారి. 2019లో ఐపీఎల్ మార్చి 29 నుంచి మే 19 వరకూ జరగనుంది. దీంతో మొదటి మ్యాచ్ జూన్ 5న మాత్రమే ఆడాలి..! 2019 వరల్డ్ కప్ మే 30 నుండి జూలై 14వరకూ జరగనుంది. 28 ఏళ్ల తర్వాత 2011లో భారత్ వరల్డ్ కప్ గెలిచింది. 2019 వరల్డ్ కప్ లో భారతజట్టు ఫేవరెట్ గా అడుగుపెట్టనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here