ఉప్ప‌ల్‌లో డే/నైట్ టెస్ట్‌మ్యాచ్‌?

వ‌న్డే, టీ20 త‌ర‌హాల్లోనే టెస్ట్‌ల‌ల్లో కూడా డే/ నైట్ మ్యాచ్‌లు వ‌చ్చేశాయి. ఇప్ప‌టిదాకా- టీమిండియా ఈ డే/ నైట్ టెస్ట్‌మ్యాచ్‌ల‌ను ఆడ‌లేదు. ఆ కొర‌త ఇప్పుడు తీర‌బోతోంది ఈ ఏడాదే. ఈ ఏడాది చివ‌రిలో భార‌త ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చే విండీస్ జ‌ట్టు రెండు టెస్టుమ్యాచ్‌ల‌ను ఆడుబోతోంది. ఇందులో ఒక‌టి డే/నైట్ మ్యాచ్‌గా నిర్వ‌హిస్తామ‌ని బీసీసీఐ వెల్ల‌డించింది.

హైద‌రాబాద్‌, రాజ్‌కోట్ వేదిక‌గా ఈ రెండు టెస్ట్‌మ్యాచ్‌లు ఉంటాయ‌ని పేర్కొంది. హైద‌రాబాద్ ఉప్ప‌ల్ స్టేడియంలో జ‌రిగే మ్యాచ్‌ను డే/ నైట్‌గా నిర్వ‌హించే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియా-న్యూజీలాండ్ జ‌ట్ల మ‌ధ్య మొట్ట‌మొద‌టి సారిగా డే/నైట్ టెస్ట్‌మ్యాచ్‌ను నిర్వ‌హించారు. ఈ మ్యాచ్‌లో గులాబీరంగు బంతిని ఉప‌యోగిస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here