మూడో టెస్టులో సంచలన విజయం సాధించిన భారత్..!

మూడో టెస్టులో భారత్ సంచలన విజయం సాధించింది. నాలుగో రోజు మొదటి సెషన్ పూర్తీ అయ్యే సమయానికి భారత్ విజయానికి చాలా దూరంగా కనిపించింది. అయితే ఆమ్లా వికెట్ తీశాక మాత్రం భారత్ వెనుతిరిగి చూడలేదు. ఆమ్లా 52 పరుగులు చేసి అవుట్ అవ్వగా.. సౌత్ ఆఫ్రికా మిడిల్ ఆర్డర్, లోయర్ ఆర్డర్ భారత బౌలింగ్ దెబ్బకు విలవిలలాడింది. ఏకంగా నలుగురు డకౌట్ గా వెనుదిరిగారు. చివర్లో 10 వికెట్ తో ఎల్గార్ కాస్త అడ్డుపడినప్పటికీ బౌలర్లు లాంఛనం పూర్తీ చేశారు. 1-2 తేడాతో భారత్ టెస్ట్ సిరీస్ ను కోల్పోయింది.

భారత్ మొదటి ఇన్నింగ్స్ లో 187 పరుగులు చేయగా.. సౌత్ ఆఫ్రికా 194 పరుగులు చేసింది. ఇక రెండో ఇన్నింగ్స్ లో భారత్ 247 పరుగులకు ఆలౌట్ అయింది. 241 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌత్ ఆఫ్రికా 177 పరుగులకు ఆలౌట్ అయింది. 63 పరుగులతో భారత్ ఈ టెస్ట్ మ్యాచ్ ను సొంతం చేసుకుంది. మొహమ్మద్ షమీ రెండో ఇన్నింగ్స్ లో 5 వికెట్లు తీసి భారత్ విజయానికి బాటలు వేశాడు. డీన్ ఎల్గార్ 86 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here