`ప‌రి` చూసిన విరాట్ కోహ్లీ త‌న భార్య గురించి ఏం చెప్పాడంటే..!

ముంబై: బాలీవుడ్ బ్యూటీ అనూష్క శ‌ర్మ న‌టించిన తాజా చిత్రం `ప‌రి`. కంప్లీట్ హార‌ర్ మూవీ ఇది. ఒంట‌రిగా ఈ సినిమా చూసిన వాళ్ల‌కు స‌ర్‌ప్రైజ్‌గా ప్రైజులిస్తామ‌ని కూడా ప్ర‌క‌టించింది చిత్రం యూనిట్‌. అంత‌టి భ‌య‌పెట్టే ప్యూర్ హార‌ర్‌లో మొద‌టిసారిగా న‌టించింది అనూష్క శ‌ర్మ‌.

 

భార‌త క్రికెట్ జ‌ట్టు కేప్టెన్ విరాట్ కోహ్లీని పెళ్లాడిన త‌రువాత విడుదలైన మొద‌టి సినిమా కూడా ఇదే. విడుద‌ల‌కు ముందే.. ఈ సినిమాను చూసేశాడ‌ట విరాట్ కోహ్లీ. త‌న భార్య ఎంత గొప్పగా న‌టించిందో అంటూ ట్వీట్లు వ‌దిలాడు. ఆమె న‌ట‌నను చూసి గ‌ర్వ‌ప‌డుతున్నాన‌ని పొంగిపోయాడు. ఒంట‌రిగా చూడాలంటే భ‌య‌మేసింద‌ని చెప్పుకొచ్చాడు.

ఈ సినిమా చూస్తూ.. తాను తెగ భ‌య‌ప‌డ్డాన‌ని కూడా ట్వీట్‌లో రాసుకొచ్చాడు. ఈ స‌బ్జెక్ట్ న‌చ్చి.. త‌న సొంత బ్యాన‌ర్ క్లీన్ స్లేట్ ఫిల్మ్స్ మీద నిర్మించింది అనూష్క‌. బెంగాలీ ద‌ర్శ‌కుడు ప్ర‌జిత్ రాయ్ మొద‌టి సినిమా కూడా ఇదే.

అనూష్క‌తో పాటు ప‌ర‌మ్‌బ్ర‌త ఛ‌ట‌ర్జీ న‌టించారు. హోలీ పండుగ‌ను పుర‌స్క‌రించుకుని ప్ర‌పంచ‌వ్యాప్తంగా శుక్ర‌వారం విడుద‌లైంది ఈ మూవీ. హార‌ర్ ఫ్లిక్‌ల‌ను ఇష్ట‌ప‌డేవారికి క‌ట్టి ప‌డేస్తోంద‌నేది టాక్‌.

https://twitter.com/imVkohli/status/969442794493407232

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here