దేశాన్ని చుట్ట‌బెట్టేస్తోన్న `ఫీఫా` ఫీవర్‌..!

`ఫీఫా` ఫీవ‌ర్‌.. ఇదేదో ప్రాణాల‌ను తీసే నిఫా వైర‌స్‌లాంటిది కాదు గానీ.. 90 నిమిషాల పాటు జ‌నాల‌ను టీవీ ముందు నుంచి క‌ద‌ల‌నివ్వ‌ని వ్యాధి. ఫీఫా ఫీవ‌ర్‌.. దేశం మొత్తాన్నీ ఆవ‌రించింద‌న‌డానికి ఈ ఫొటోలే నిద‌ర్శ‌నం. ర‌ష్యా వేదిక‌గా ఫీఫా ఫుట్‌బాల్ ప్ర‌పంచ‌క‌ప్ ఆరంభం కావ‌డానికి కొన్ని గంట‌ల ముందు ప‌శ్చిమ బెంగాల్‌లో క‌నిపించిన దృశ్యం ఇది. ప‌శ్చిమ బెంగాల్ 24 ప‌ర‌గ‌ణా జిల్లా కేంద్రంలో ఓ టీ షాపు య‌జ‌మాని త‌న అభిమానాన్ని ఇలా చాటుకుంటున్నాడు.

1986 ఫుట్‌బాల ప్ర‌పంచ‌క‌ప్ పోటీల త‌రువాత‌.. దాని ప‌ట్ల విప‌రీతంగా ఆక‌ర్షితుడ‌య్యాడు. ఆయ‌న పేరు శిబ్‌శంక‌ర్ పాత్ర‌. అర్జెంటీనా టీమ్ అంటే ప‌డిఛ‌స్తాడు. త‌న ఇంటిని అర్జెంటీనా టీమ్ జెర్సీ త‌ర‌హాలో డిజైన్ చేశాడు. తానూ అలాంటి జెర్సీని ధ‌రించాడు. త‌న‌కు ప‌రిచ‌యం ఉన్న వారంద‌రికీ ఆ జెర్సీల‌ను పంచిపెట్టాడు. అర్జెంటీనా స్టార్ ప్లేయ‌ర్ మెస్సీ అంటే త‌న‌కు చాలా ఇష్ట‌మ‌ని చెబుతున్నాడు శిబ్‌శంక‌ర్‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here