యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో జాక్ పాట్ కొట్టిన భారతీయుడు.. 18కోట్లు అతడి సొంతం..!

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో భారతీయుడు జాక్ పాట్ కొట్టాడు. అబుదాబీలో నిర్వహించిన లాటరీలో ఏకంగా 10 మిలియన్ల దిర్హాంల లాటరీని అతడు అందుకున్నాడు. అంటే భారత కరెన్సీలో 18 కోట్లన్నమాట..! ఈ లాటరీలో మరికొంత మంది భారతీయులకు కూడా అదృష్టం కలిసివచ్చింది.

డిక్సన్ కత్తితార అబ్రహాం.. నైజీరియాలో నివసిస్తూ ఉంటాడు. అతడు అక్కడికి వెళ్ళే క్రమంలో అబుదాబీ లో బిగ్ టికెట్ లాటరీ టికెట్ ని కొనుక్కున్నాడు. జూన్ 3న లాటరీని తీయగా.. 10 మిలియన్ల దిర్హాంలు అతడి సొంతం అయ్యాయి. ఏకంగా 18,22,25,000 రూపాయలు అందుకోబోతున్నాడు. ఇతడు జాక్ పాట అందుకోగా మరికొన్ని ప్రైజులలో 5 భారతీయులకు.. మూడు పాకిస్థానీయులకు లభించాయి. బిగ్ టికెట్ అబుదాబీ లాటరీ టికెట్ అన్నది చాలా ఏళ్ళుగా అక్కడ కొనసాగుతోంది. ఎంతో మంది అబుదాబీ ఎయిర్ పోర్టులో దిగినప్పుడు వాటిని కొంటూ ఉంటారు. ఒక్కసారి జాక్ పాట తగిలిందంటే.. వారి జీవితం బాగుపడిపోయినట్లే..! ఈ ఏడాది ఏప్రిల్ లో దుబాయ్ లో పనిచేస్తున్న భారత డ్రైవర్ కు 12 మిలియన్ల దిర్హాంలు లభించాయి.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here