విమానంలో భార్యను పక్కనే పెట్టుకొని ఇంకో అమ్మాయి బట్టల్లో చేయివేశాడు.. ఫలితం అనుభవిస్తున్న భారతీయుడు..!

విమానంలో భార్యను పక్కనే పెట్టుకొని తోటి ప్రయాణీకురాలిని గోకిన భారతీయుడు ప్రస్తుతం ఫలితం అనుభవిస్తున్నాడు. బెయిల్ రాక ప్రస్తుతం అమెరికా లోని జైలులో మగ్గుతున్నాడు. అటు పరువూ పోవడమే కాకుండా.. ఇటు ఊచలు కూడా లెక్కపెట్టాల్సివచ్చింది.

ఇంతకూ ఏమి జరిగింది:

లాస్‌వేగాస్ నుంచి డెట్రాయిట్ వెళ్తున్న విమానంలో ప్రభు రామమూర్తి (34) తన భార్యతో కలిసి ప్రయాణిస్తున్నాడు. అతడు తానా భార్యకు మరో అమ్మాయి మధ్య సీట్ లో కూర్చున్నాడు. 22 ఏళ్ల ఆ అమ్మాయి నిద్రలోకి జారుకుంది. అయితే రామమూర్తి మాత్రం ఆ అమ్మాయిని తాకడం మొదలుపెట్టాడు. ఆమె నిద్ర లేచే సమయానికి బట్టలకు ఉన్న గుండీలు అన్నీ ఊడిపోయాయి. రామమూర్తి చేతులు ఆ అమ్మాయి బట్టల్లో ఉండిపోయాయి. దీంతో ఆమె గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. విమాన సిబ్బందికి తనతో అసభ్యంగా తాకాడని ఆమె చెప్పుకొచ్చింది.

రామమూర్తి భార్య ఆ అమ్మాయి గాఢ నిద్రలోకి వెళ్లిందని. తన భర్త కాళ్ళ మీద పడుకొందని చెప్పుకొచ్చింది. విమానంలో ఆమెను వేరే సీట్ లో కూర్చోబెట్టారు. విమానం డెట్రాయిట్‌లో ల్యాండ్ అవగానే పోలీసులు రామమూర్తిని అదుపులోకి తీసుకున్నారు. కోర్టును ఆశ్రయించగా బెయిల్ ఇవ్వడానికి న్యాయమూర్తి అంగీకరించలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here