మనకు అంత అదృష్టం ఎక్కడ ఏడ్చి చచ్చింది.. తగ్గించింది ‘1’ పైసానే..!

ఒక్క పైసా.. ఒకే ఒక్క పైసా.. సామాన్యులకు తగ్గిన పెట్రోల్, డీజిల్ రేట్లపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చేసింది. ఢిల్లీలో లీటరు పెట్రోలుకు 60 పైసలు, ముంబైలో 59 పైసలు, ఢిల్లీలో డీజిల్‌పై 56 పైసలు, ముంబైలో 59 పైసలు తగ్గించామని ఉదయం ప్రకటన వచ్చింది. అయితే ఆ ప్రకటన చేసిన మూడంటే మూడు గంటల్లో పొరపాటు జరిగిపోయింది.. తగ్గింది ఒక్క పైసానే అని అంటే ఎవరికైనా కోపం వస్తుంది. ఇప్పుడు మన పరిస్థితి కూడా అలాగే ఉంది.


వరుసగా 19 రోజుల పాటు పరుగాపకుండా పెరుగుతూ వచ్చిన పెట్రోలు, డీజెల్ ధరలు, నేడు 60 పైసలు తగ్గాయని చెప్పారు. పెట్రోలు, డీజిల్ ధరల సవరణలో పొరపాటు జరిగిందని, తగ్గింది 60 పైసలు కాదని, ఒక్క పైసా మాత్రమేనని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకటించింది. ఈ ఉదయం పెట్రోలు ధరను 60 పైసలు, డీజల్ ధరను 59 పైసలు తగ్గిస్తున్నట్టు ఐఓసీ ప్రకటించింది. ఆ తరువాత తప్పును సరిదిద్దుకుంటున్నామని ధర తగ్గనే లేదని.. కేవలం ఒక్క పైసా మాత్రమేనని చెప్పి చేతులు దులుపుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here