నిరుద్యోగులు ఈ రేంజిలో ఉన్నారా.. లక్ష రైల్వే జాబ్స్ కోసం ఏకంగా అంతమంది అప్లై చేశారా..!

భారతదేశంలో నిరుద్యోగ సమస్య ఇప్పటిది కాదు.. కొన్ని దశాబ్దాలుగా వస్తూనే ఉంది. తాజాగా రైల్వేలో ఉద్యోగాల కోసం వచ్చిన స్పందన చూస్తుంటే మనమంతా షాక్ అవ్వాల్సిందే.. ఎందుకంటే 1,10,000 ఉద్యోగాల కోసం ఇప్పటివరకు దాదాపు 2.12 కోట్ల మంది దరఖాస్తు చేసుకున్నారు.

90 వేల ఉద్యోగాల భర్తీకి గతనెల రైల్వే శాఖ ప్రకటన విడుదల చేసింది. ఆ తర్వాత మరో 20 వేల ఉద్యోగాలను కూడా భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. మొత్తం 1,10,000 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు రైల్వే శాఖ ఇచ్చిన ప్రకటనకు దేశవ్యాప్తంగా నిరుద్యోగుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. ఈ ఉద్యోగాలకు ఇప్పటివరకు దాదాపు 2.12 కోట్లకు పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు రైల్వే సీనియర్ అధికారి ఒకరు మీడియాకి తెలిపారు. దరఖాస్తుల దాఖలుకు చివరి తేదీ నేటితో ముగుస్తుంది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని ఆయన చెప్పారు.

రైల్వేల్లో ప్రస్తుతం 13.5 లక్షల మందికి పైగా సిబ్బంది పనిచేస్తున్నారు. ఇప్పుడు విడుదల చేసిన నోటిఫికేషన్ మాత్రమే కాకుండా త్వరలో రైల్వే భద్రతా దళం (రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్-ఆర్పీఎఫ్), రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ (ఆర్పీఎస్‌ఎఫ్) విభాగాల్లోనూ త్వరలో మరో 9 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని రైల్వే శాఖ వెల్లడించింది. మే నెలలో ప్రకటన విడుదలయ్యే అవకాశముంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here