ఆర్ఆర్బీ పరీక్షలు రాస్తున్నారా.. నిరుద్యోగులకు తీపి కబురు వినిపించిన రైల్వే.. సంతోషించే విషయం..!

నిరుద్యోగులకు భారత రైల్వే శుభవార్తను చెప్పింది. ఆర్.ఆర్.బీ. పరీక్షలు రాసే అభ్యర్థుల వయో పరిమితిని పెంచడమే కాకుండా పరీక్షలను మాతృభాషలోనే రాసుకొనే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు తెలిపింది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు తీసుకున్న ఈ నిర్ణయానికి నిరుద్యోగులు ఎంతగానో సంతోషిస్తున్నారు.

అసిస్టెంట్ లోకోపైలట్ పోస్టులకు జనరల్ కేటగిరీ అభ్యర్థుల వయోపరిమితిని 28 ఏళ్ల నుంచి 30 ఏళ్లకు పెంచగా, ఓబీసీ అభ్యర్థుల వయోపరిమితిని 33 ఏళ్లకు పెంచింది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల వయోపరిమితిని 33 నుంచి 35 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గ్రూప్-డి పోస్టుల్లో జనరల్ అభ్యర్థుల వయో పరిమితిని 28 నుంచి 30 ఏళ్లకు పెంచింది. ఓబీసీలకు 36, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల వయోపరిమితిని 38 ఏళ్లకు పెంచింది.

మొత్తం 91,307 ఉద్యోగాల కోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ సందర్భంగా నోటిఫికేషన్‌లో పలు మార్పులు చేసింది. వయోపరిమితి పెంచాలంటూ బిహార్, మాతృభాషలోనూ పరీక్షలు నిర్వహించాలంటూ కేరళ అభ్యర్థులు చేస్తున్న డిమాండ్‌ను దృష్టి పెట్టుకుని ఈ మార్పులు చేసింది. హిందీ, ఇంగ్లిష్ భాషల్లో గతంలో పరీక్షలు నిర్వహించగా ఇకపై తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, ఒరియా, బెంగాళీ భాషల్లోనూ నిర్వహించనున్నట్టు నోటిఫికేషన్‌లో పేర్కొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here