కామన్వెల్త్ బ్యాడ్మింటన్ ఫైనల్ లో సింధు పై నెగ్గిన సైనా..!

ప్రస్తుతం భారత బ్యాడ్మింటన్ లో దూసుకుపోతోంది ఎవరు అంటే సింధు అనే చెబుతాం.. ఎందుకంటే గత కొద్ది నెలలుగా సైనా అంత గొప్పగా రాణించడం లేదు. అయితే కామన్వెల్త్ బ్యాడ్మింటన్ ఫైనల్ లో మాత్రం సింధు ను సైనా అడ్డుకుంది. భారత్ వర్సెస్ భారత్ మ్యాచ్ లో ఇద్దరూ అద్భుతంగా ఆడారు. కానీ స్వర్ణం మాత్రం సైనాకే వరించింది. సింధు రజత పతకంతో సరిపెట్టుకుంది.

సైనా నెహ్వాల్ 21-18, 23-21 తేడాతో సింధుపై వరుస సెట్లలో నెగ్గి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకోగా, సింధు రజతంతో సరిపెట్టుకుంది. తొలి గేమ్ నుంచి దూకుడుగా ఆడిన సైనా నెహ్వాల్ మూడు పాయింట్ల తేడాతో సెట్ ను గెలిచి, ఆపై అదే జోరును రెండో సెట్లోనూ కొనసాగించింది. ఆటను మూడో సెట్ కు తీసుకువెళ్లేందుకు సింధూ శ్రమించినా ఫలితం దక్కలేదు. ఈ మ్యాచ్ తరువాత భారత్ ఖాతాలోకి 26వ స్వర్ణ పతకం చేరగా, రజత పతకాల సంఖ్య 17కు పెరిగింది. మొత్తం 77 స్వర్ణాలతో 185 పతకాలు సాధించిన ఆస్ట్రేలియా పతకాల పట్టికలో తొలి స్థానంలో ఉండగా, 42 స్వర్ణాలతో ఇంగ్లండ్ రెండో స్థానంలో ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here