స‌ముద్ర‌పు అంచుల్లో కొండ‌గుట్ట‌..దానిపై నిల్చుని సాహ‌సం! దీని ఫ‌లితం?

ఉన్న‌త విద్య‌ను అభ్య‌సించ‌డానికి ఆస్ట్రేలియాకు వెళ్లిన ఓ భార‌తీయ యువ‌కుడు.. దుర్మ‌ర‌ణం పాల‌య్యాడు. అత‌ని స‌ర‌దా అత‌ణ్ని బ‌లి తీసుకుంది. ఆ యువ‌కుడి పేరు అంకిత్‌. వ‌య‌స్సు 20 సంవ‌త్స‌రాలు. పెర్త్ యూనివ‌ర్శిటీలో బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో పీజీ చేస్తున్నాడు.

 

త‌న స్నేహితుల‌తో క‌లిసి అల్బ‌నీ టౌన్‌కు వెళ్లిన అంకిత్‌.. అక్క‌డి కొండ‌గుట్ట‌ల‌పై సెల్ఫీ తీసుకుంటూ ప్ర‌మాదావ‌శావ‌త్తూ స‌ముద్రంలో ప‌డిపోయాడు. ప‌శ్చిమ ఆస్ట్రేలియాలోని చారిత్ర‌క ప‌ట్ట‌ణం అల్బ‌నీ టౌన్‌. హిందూ మ‌హా స‌ముద్రానికి ఆనుకుని ఉంటుందీ టౌన్‌. ప్ర‌ముఖ ప‌ర్యాట‌క కేంద్రం కూడా. `ద గ్యాప్‌` పేరుతో స‌హ‌జంగా ఏర్ప‌డిన వంతెన ఉంటుందక్క‌డ‌. దీని మీది నుంచి కొండ‌గుట్ట‌పై దూక‌డానికి ప్ర‌య‌త్నించి, 40 మీట‌ర్ల ఎత్తు నుంచి స‌ముద్రంలో ప‌డిపోయాడు.

అత‌ని స్నేహితులు వెంట‌నే స్థానిక పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. స‌మాచారం అందుకున్న వెంట‌నే పోలీసులు, అత్య‌వ‌స‌ర స‌ర్వీసుల సిబ్బంది సంఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. సుమారు రెండు గంట‌ల త‌రువాత అంకిత్ మృత‌దేహాన్ని వెలికి తీశారు. అంకిత్ స్వ‌రాష్ట్రం గుజ‌రాత్‌ అని తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here