సిగ్గుచేటు! పోర్న్ సైట్ల‌లో ఆసిఫా గ్యాంగ్‌రేప్ వీడియో కోసం వెదుకుతున్న జ‌నం!

ముంబై: ఒక‌వంక చిన్నారి ఆసిఫా సామూహిక అత్యాచారం, హ‌త్యోదంతంపై క‌న్నీరు కారుస్తోన్న ప్ర‌జ‌లు.. మ‌రోవంక ఆమె అత్యాచార వీడియో కోసం క‌ళ్లు కాయ‌లు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఆసిఫాపై అత్యాచారం చేస్తోన్న వీడియో దొరుకుతోందేమోనంటూ పోర్న్ వెబ్‌సైట్ల‌లో సెర్చ్ చేస్తున్నారు.

 

పోర్న్ సైట్ల‌లో సెర్చ్ చేసే వీడియోల్లో `ఆసిఫా` అనే పేరు టాప్ ట్రెండింగ్‌లో ఉండ‌టమే దీనికి నిద‌ర్శ‌నం. ఆసిఫా అనే పేరు మీద వీడియో దొర‌క్కపోతే `క‌థువా`, `జ‌మ్మూ కాశ్మీర్ గ‌ర్ల్‌` అనే పేర్ల‌తోనూ సెర్చ్ చేస్తున్న‌ట్టు తేలింది. భార‌త్ నుంచే పెద్ద ఎత్తున సెర్చ్ వ‌స్తున్న‌ట్టు పోర్న్ వెబ్‌సైట్ల సర్వే తేల్చింది.

జ‌మ్మూ కాశ్మీర్‌లోని క‌థువాలో ఎనిమిదేళ్ల చిన్నారి ఆసిఫా సామూహిక అత్యాచారానికి గురైన విష‌యం తెలిసిందే. కొన్ని రోజుల పాటు ఆమెను నిర్బంధించి, ఆహారం ఇవ్వ‌కుండా మ‌రీ.. అత్యాచారం చేశారు కొంద‌రు నీచులు. ఈ ఘ‌ట‌న‌పై దేశ‌వ్యాప్తంగా ఆందోళ‌న‌లు చెల‌రేగుతున్నాయి. నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు జ‌రుగుతున్నాయి.

దాదాపు అన్ని రాజ‌కీయ పార్టీలూ ఈ ఘ‌ట‌న‌పై స్పందించాయి. నిందితుల‌ను క‌ఠినంగా శిక్షించాలంటూ ప్ర‌తి ఒక్క‌రు గ‌ళ‌మెత్తుతున్నారు.

సుప్రీంకోర్టులో దీనిపై విచార‌ణ కొన‌సాగుతోంది. భార‌తీయులంద‌రూ ఏక‌తాటిపై నిలిచి, ఆసిఫాకు న్యాయం చేయాల‌ని గొంతెత్త‌డం గ‌ర్వించ‌ద‌గ్గ విష‌య‌మే అయిన‌ప్ప‌టికీ.. అదే స‌మ‌యంలో.. పోర్న్ వెబ్ సైట్ల‌లో ఆ బాలిక అత్యాచార వీడియో కోసం వెద‌క‌డం త‌ల‌వంపులు తెస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here