గుడ్లు పెట్టే కుర్రాడు! ఆసుప‌త్రిలో డాక్ట‌ర్ల ఎదురుగా గుడ్డు పెట్టాడు! దాన్నిప‌గుల‌గొట్టి చూడ‌గా!

ఈ ఎక్స్‌రేలో ఓ గుడ్డు క‌నిపిస్తోంది క‌దూ! ఆ గుడ్డు మింగినదేమీ కాదు. బ‌య‌టికి రావ‌డానికి రెడీగా ఉన్న గుడ్డు. ఆ శ‌రీరం 14 సంవ‌త్స‌రాల ఓ కుర్రాడిది.

ఆ కుర్రాడు మామూలోడు కాదు. గుడ్లు పెట్టే పిల్లాడు. రెండేళ్ల‌లో 20 గుడ్లు పెట్టేశాడు. ఇక వాటిని కోడి గుడ్లు అనాలో..పావురం గుడ్లు అనాలో తెలియ‌ట్లేదు గానీ.. గుడ్లు మాత్రం పెట్టేస్తున్నాడు.

అచ్చం కోడి గుడ్డు ఆకారంలో ఉన్నాయ‌వి. మల విసర్జన ప్రాంతం నుంచి బయటకు వస్తున్నాయి. ఆ కుర్రాడి పేరు అక్మల్. ఇండోనేషియాకు చెందిన వాడు. ఇండోనేషియాలోని గోవ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు.

2016 నుంచి ఇప్పటి వరకు 20 గుడ్లు పెట్టాడట‌. దీనిపై అత‌ను షేక్ యూసుఫ్ ఆసుప‌త్రి డాక్టర్లను సంప్రదించాడు అక్మల్ తండ్రి. వెరైటీ ఏమిటంటే.. ఆసుప‌త్రి బెడ్ మీద కూడా రెండు గుడ్లు పెట్టాడు.

ఆసుప‌త్రిలో బెడ్ పై పడుకుని ఉన్న ఆక్మల్ నుంచి బయటకు వచ్చిన గుడ్డును వీడియో తీశాడత‌ని తండ్రి. ఈ వీడియో చూసిన డాక్ట‌ర్లు ఆశ్చ‌ర్య‌పోతున్నారు.

ఇదెలా సాధ్య‌మంటూ తిక‌మ‌క ప‌డుతున్నారు. ప్రత్యేక వైద్యబృందాన్ని నియ‌మించి అక్మల్ శరీరం మొత్తం స్కానింగ్ చేస్తున్నారు. గుడ్ల‌ను ప‌గుల‌గొట్టి చూడ‌గా లోప‌లంతా తెల్ల‌గా ఉంద‌ట‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here