బ‌ల్లుల‌కు ఊహించ‌ని రేటు..అయినా క‌ళ్లు మూసుకుని కొనేశాడు!

ఇండోర్‌: ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫొటోలో క‌నిపిస్తోన్న‌ది బ‌ల్లులే. అచ్చంగా బ‌ల్లులే. కాక‌పోతే- భారీగా ఉన్నాయ‌వి. మ‌న ఇళ్ల‌ల్లో క‌నిపించే గోడ మీద బ‌ల్లుల్లాంటివే అయిన‌ప్ప‌టికీ.. అరుదైన జాతికి చెందిన‌వి. వాటిని కొనాల‌ని ముచ్చ‌ట‌ప‌డ్డాడో ఆసామి. భారీ రేటు ప‌లికాయ‌వి. ఒక్కో బ‌ల్లి ల‌క్ష రూపాయ‌లు. అయిన‌ప్ప‌టికీ.. క‌ళ్లు మూసుకుని రెండింటినీ కొనేశాడాయ‌న‌.

ఆ బ‌ల్లుల‌ను భుజంపై పెట్టుకుని మోస్తూ ముచ్చట తీర్చుకుంటున్నారు. ఆయ‌న పేరు సాగ‌ర్‌. ఓ జ్యూస్ షాప్ ఓన‌ర్‌. కాస్త డిఫ‌రెంట్ టేస్ట్ ఉన్న వ్య‌క్తి. అందుకే- ఈ అరుదైన బ‌ల్లులు ముంబైలో ఉన్నాయ‌ని తెలిసిన వెంట‌నే వారిని సంప్ర‌దించాడు. ఒక్కో బ‌ల్లి ధ‌ర ల‌క్ష రూపాయ‌లు చొప్ప‌న‌.. రెండు ల‌క్ష‌లు ధార‌బోసి ఆ రెండింటినీ కొనుక్కుని, ఇంటికి తీసుకొచ్చాడు. ఈ బ‌ల్లులు ఇగ్వానా జాతికి చెందిన‌వి. శాకాహార‌లు. ఎక్కువగా ఇవి ద‌క్షిణ అమెరికాలో సంచరిస్తుంటాయట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here