ర‌ద్దీ మార్గంలో స్కూట‌ర్‌పై వెళ్తోన్న మోడ‌ల్ ప‌ట్ల ఘాతుకం! స్క‌ర్టు లాగ‌డంతో కింద‌ప‌డి!

భోపాల్‌: మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఇండోర్‌లో కిరాత‌క ఘ‌ట‌న చోటు చేసుకుంది. స్కూట‌ర్‌పై త‌న స్నేహితురాలితో క‌లిసి వెళ్తోన్న ఓ మోడ‌ల్ ప‌ట్ల అమానుషంగా ప్ర‌వ‌ర్తించారు ఇద్ద‌రు వ్య‌క్తులు. త‌మ బైక్‌పై ఆమెను వెంబ‌డించ‌డ‌మే కాకుండా.. వేసుకున్న స్క‌ర్టును ప‌ట్టుకుని లాగారు. `స్క‌ర్టు కింద ఏముందో చూపించు..` అంటూ అవ‌మానించారు.

స్క‌ర్టును లాగ‌డంతో స్కూట‌ర్ అదుపు త‌ప్పింది. దీనితో మోడ‌ల్‌, ఆమె స్నేహితురాలు కింద ప‌డ్డారు. మోడ‌ల్ కాలికి తీవ్ర గాయాల‌య్యాయి. గాయాలైన త‌న కాలిని ఫొటో తీసి, సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇలాంటి కిరాత‌క చర్య‌ల‌కు అడ్డుక‌ట్ట ప‌డేదెప్పుడు? అంటూ ఆమె ప్ర‌శ్నిస్తున్నారు.

ఆదివారం ఉద‌యం ఇండోర్‌లో ర‌ద్దీ మార్గ‌మైన మాన్‌సింగ్ మార్గ్‌లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌పై బాధిత మోడ‌ల్ ప‌లు ట్వీట్ల‌ను సంధించారు. వంద‌లాది వాహ‌నాలు రాక‌పోక‌లు సాగిస్తున్న‌ప్ప‌టికీ.. ఏ ఒక్క‌రు కూడా వారి చ‌ర్య‌ల‌ను అడ్డుకోవ‌డానికి ముందుకు రాలేద‌ని చెప్పారు.

సంఘ‌ట‌న చోటు చేసుకున్న ప్ర‌దేశంలో సీసీ కెమెరాలు లేక‌పోవ‌డం త‌న దుర‌దృష్ట‌మ‌ని, ఆ ఆగంత‌కుల బైక్ నంబ‌ర్‌ను కూడా తాను నోట్ చేసుకోలేక‌పోయాన‌ని అన్నారు. స్థానిక పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశాన‌ని, పోలీసు వ్య‌వ‌స్థ‌పై త‌న‌కు ఇంకా న‌మ్మ‌కం ఉంద‌ని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here