ఇంటర్ విద్యార్థిని.. బిడ్డకు జన్మనిచ్చింది.. వేరే వారి చేతిలో పెట్టి పెంచుకోమని వెళ్ళిపోయారు..!

ఇంటర్ విద్యార్థిని.. ప్రియుడికి దగ్గరైంది. 17 ఏళ్ళు కూడా నిండని ఆ అమ్మాయి గర్భం దాల్చింది. విషయం బయట తెలీకూడదని ఆ అమ్మాయి తల్లి ఆసుపత్రిలో చేర్పించింది. ఆ పాప బిడ్డకు జన్మనివ్వగా ఆ బిడ్డను వేరే వాళ్ళ చేతిలో పెట్టి.. మీరే పెంచుకోండి అని చెప్పి వెళ్ళిపోయారు. అయితే పుట్టిన ఆ బిడ్డ ఎక్కువ రోజులు బ్రతకలేకపోయింది. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆ శిశువు మరణించింది.

ఈ ఘటన విశాఖపట్నం జిల్లా పాడేరులో చోటుచేసుకుంది. పాడేరు మండలం లింగపుట్టు గ్రామానికి చెందిన ఓ యువతి హుకుంపేటలోని కళాశాలలో ఇంటర్‌ చదువుతోంది. ప్రియుడితో శారీరకంగా దగ్గరైంది. నెలల నిండాయి. ఈ విషయం బయటకు చెప్పలేదు. తల్లికి విషయం తెలియడంతో బయటకు రాకుండా చూడాలని అనుకుంది. కొద్ది రోజుల పాటూ ఊరికి దూరంగా ఉంచింది. అబార్షన్ కు సమయం మించిపోవడంతో ఎట్టకేలకు డెలివరీ వరకూ ఎదురుచూశారు.

కడుపు నొప్పితో బాధపడుతున్నట్లు చెప్పి బాలికను ఆసుపత్రికి తీసుకొచ్చింది. ప్రసవించిన వెంటనే ఓ దంపతులకు శిశువును పెంచుకోమని అప్పగించి కుమార్తెతో కలిసి స్వగ్రామానికి వెళ్లిపోయింది. శిశువు తక్కువ బరువుతో జన్మించడంతో స్థానిక శిశు సంరక్షణ కేంద్రంలో ఉంచారు. కేజీహెచ్‌కు తీసుకువెళ్లేందుకు అంబులెన్సు సిద్ధంగా చేయగా ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శిశువు మృతి చెందింది. 17 ఏళ్ల అమ్మాయి ప్రసవించిందన్న విషయంపై పోలీసులు ఆరాతీస్తున్నారు. ప్రేమికుడిని, ఆ అమ్మాయి తల్లిని విచారించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here