నేను ఛ‌స్తే నాన్న‌, అక్క‌ ఆనందంగా ఉంటారు!

హైద‌రాబాద్‌: ఇంట‌ర్మీడియ‌ట్ విద్యార్థిని ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఘ‌ట‌న ఇది. హైద‌రాబాద్ నాగోల్‌లోని జైపురి కాల‌నీలో చోటు చేసుకుంది. తాను మ‌ర‌ణిస్తే, నాన్న‌, చెల్లి ఆనందంగా ఉంటార‌ని ఆమె ఆత్మ‌హ‌త్య లేఖ‌లో పేర్కొన్నారు. ఇంట‌ర్మీడియ‌ట్ ప‌రీక్ష‌ల‌ను స‌రిగా రాయ‌లేక‌పోవ‌డం వ‌ల్ల తాను ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌ట్లేద‌ని, ఆ ప‌రీక్ష‌ల‌ను బాగా రాశాన‌ని అన్నారు.

మృతురాలి పేరు సాయి ప్రియ‌. జైపురి కాల‌నీలో నివ‌సించే భూపాల్ రెడ్డి కుమార్తె ఆమె. భూపాల్ రెడ్డికి ఇద్ద‌రు కుమార్తెలు. రెండో కుమార్తె సాయి ప్రియ‌. ఇంట‌ర్మీడియ‌ట్ ప‌రీక్ష‌లు ముగియ‌డంతో సాయి ప్రియ గురువారం సాయంత్రం త‌న తండ్రి మొబైల్ తీసుకుని ఫ్రెండ్స్‌తో ఛాటింగ్ చేసింది.

చాలాసేప‌టి వ‌ర‌కు ఛాటింగ్ చేస్తూ కూర్చోవ‌డంతో భూపాల్ రెడ్డి, ఆయ‌న పెద్ద కుమార్తె ఆగ్ర‌హించారు. సాయి ప్రియ‌ను మంద‌లించారు. దీనితో ఏడుస్తూ త‌న గ‌దిలోకి వెళ్లి, ఫ్యాన్‌కు ఉరి వేసుకుని బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డారు. ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డానికి ముందు ఆమె లేఖను రాశారు. తాను మ‌ర‌ణిస్తే నాన్న‌, అక్క ఆనందంగా ఉంటార‌ని అందులో పేర్కొన్నారు.

ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌ను బాగా రాయ‌లేక‌పోవ‌డం వ‌ల్లే ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లు అనుకోవ‌ద్ద‌ని, తాను ప‌రీక్ష‌ల‌ను బాగా రాశాన‌నిచెప్పారు. ఆమెను గ‌మ‌నించిన భూపాల్ రెడ్డి హుటాహుటిన సాయిప్రియ‌ను నాగోల్ సుప్ర‌జ అసుప‌త్రికి త‌ర‌లించారు. అప్ప‌టికే సాయిప్రియ మ‌ర‌ణించిన‌ట్లు డాక్ట‌ర్లు చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here