ఇంట‌ర్ ప‌రీక్ష రాయ‌డానికి ఇంట్లో నుంచి బ‌య‌లుదేరింది! జొన్న చేనులో!

సిద్ధిపేట్‌: తెలంగాణ‌లోని సిద్ధిపేట్ జిల్లాలో దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఇంట‌ర్మీడియ‌ట్ విద్యార్థిని ఒక‌రు దారుణ‌హ‌త్య‌కు గుర‌య్యారు. గ్రామం వెలుప‌ల ఉన్న జొన్న చేనులో ఆమె మృత‌దేహంగా క‌నిపించింది. అత్యాచారం చేసి, హ‌త మార్చి ఉంటార‌ని పోలీసులు అనుమానిస్తున్నారు. హ‌తురాలి పేరు సుహాసిని.

జిల్లాలోని దుబ్బాక నియోజ‌క‌వ‌ర్గం మిర్‌దొడ్డి మండ‌లం ప‌రిధిలోని రుద్రారం గ్రామంలో ఈ దారుణ ఘ‌ట‌న వెలుగు చూసింది. ఇంట‌ర్మీడియ‌ట్ చ‌దువుతున్న సుహాసిని చివ‌రి సంవ‌త్స‌రం ప‌రీక్ష రాయ‌డానికంటూ ఇంట్లో నుంచి బ‌య‌లు దేరింది.

ఆమె- ప‌రీక్షా కేంద్రానికి చేర‌లేదు. ప‌రీక్ష ముగిసి..రోజూ ఇంటికి వ‌చ్చే స‌మ‌యం దాటిపోయిన‌ప్ప‌టికీ.. త‌మ కుమార్తె క‌నిపించ‌క‌పోవ‌డంతో త‌ల్లిదండ్రులు ఆందోళ‌న‌కు గుర‌య్యారు.

పోలీసుల‌కు స‌మాచారం ఇవ్వ‌డంతో కేసు న‌మోదు చేసుకున్న వారు గాలించారు. ప‌రీక్షా కేంద్రానికి వెళ్లే దారిలో ఉన్న జొన్న చేనులో సుహాసిని స‌గం కాలిన మృత‌దేహం క‌నిపించింది. మృత‌దేహం ప‌క్క‌నే ఖాళీ కిరోసిన్ డ‌బ్బా క‌నిపించింది.

గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు ఆమెపై అత్యాచారం చేసి, హ‌త‌మార్చి ఉంటార‌ని, కిరోసిన్‌తో మృత‌దేహాన్ని కాల్చి వేయ‌డానికి ప్ర‌య‌త్నించి ఉంటార‌ని పోలీసులు అనుమానిస్తున్నారు. హంత‌కుల కోసం గాలిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here