స్లిప్ టెస్టులో ఫెయిల్ అయినందుకు కూడా ఆత్మహత్య చేసుకుంటారా..!

మార్కులు అనేవి ఓ అంకెలే తప్ప.. ట్యాలెంట్ ఉంటే అవేవీ అవసరం లేదని.. ఎప్పుడు గుర్తిస్తారో ఏమో.. అలా ప్రతి ఒక్క విద్యార్థి గుర్తిస్తే ఈ దేశంలో ‘మార్కులు తక్కువగా వచ్చాయని ఆత్మహత్య’.. అన్న వార్తలే ఉండవు..! తాజాగా ఓ యువతి స్లిప్ టెస్ట్ లో ఫెయిల్ అయ్యానన్న బాధతో ఆత్మహత్య చేసుకుంది.

ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. 18 సంవత్సరాల వయసు ఉన్న ఇంటర్మీడియెట్ విద్యార్థిని అనుకోని నిర్ణయం తీసుకొని తల్లిదండ్రులకు కడుపుకోతను మిగిల్చింది. నదీమున్నీసా బేగం.. సుధాకర్ బాబు, నూర్జహాన్ బేగంల కూతురు. వారు కల్లూరు లోని ఎం.ఎస్.లక్ష్మీ నగర్ లో నివాసం ఉంటున్నారు. ఆమె కర్నూలు టౌన్ లో ఉన్న సీవీ రామన్ జూనియర్ కాలేజీలో బైపీసీ చదువుతోంది. శుక్రవారం నాడు స్టడీ అవర్స్ లో ఫిజిక్స్ లెక్చరర్ స్లిప్ టెస్ట్ పెట్టాడు. ఆ స్లిప్ టెస్ట్ లో ఆమెకు తక్కువ మార్కులు రావడంతో లెక్చరర్ ఆమెను తిట్టాడు. ఇక ఆమెను తీసుకొని వెళ్ళడానికి వచ్చిన ఆమె సోదరి తెహర్ భాను కూడా ఎందుకు తక్కువ మార్కులు వచ్చాయని తిట్టింది.

ఇద్దరితో తిట్టించుకున్న తర్వాత ఇంటికి వచ్చిన ఆ అమ్మాయి.. గదిలోకి దూరి తలుపులు వేసుకుంది. రాత్రి 7 గంటల సమయంలో ఆమె తలలో నూర్జహాన్ బేగం గది తలుపులు కొట్టింది. అయితే కూతురు వద్ద నుండి ఉలుకూ లేదు.. పలుకూ లేదు. వెంటనే ఆమె ఇరుగుపొరుగు వాళ్ళను పిలిపించి తలుపులు బద్దలు కొట్టించింది. లోపల చూడగా అప్పటికే జరగరానిది జరిగిపోయింది. యువతి సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here