సెల్‌ఫోన్‌లో గేమ్‌లు ఆడుతూ కూర్చున్నాడు..చూపుడు వేలును కోల్పోయాడు!

ఈ ఎక్స్‌రే ఓ 12 సంవ‌త్స‌రాల బాలుడిది. ఈ ఎక్స్‌రేలో చూపుడు వేలు పూర్తిగా తెగిపోయిన‌ట్టు క‌నిపిస్తోంది. కార‌ణం.. సెల్‌ఫోన్ పేలుడు. సెల్‌ఫోన్ ఛార్జింగ్‌లో పెట్టి గ్యాప్ లేకుండా గంట‌న్న‌ర‌పాటు సెల్‌ఫోన్‌లో గేమ్‌లు ఆడాడు.

దీని ఫ‌లితంగా.. హీటెక్కిపోయి, ఢామ్మంటూ పేలిందా సెల్‌ఫోన్‌. దీని ఫ‌లితం- చూపుడు వేలు తెగి కింద ప‌డింది. ఓ క‌న్ను కూడా పోయింది. చైనాలోని గ్వాంగ్ఝి ప్రావిన్స్‌లో చోటు చేసుకుంది ఈ ఘ‌ట‌న‌. పేలింది కూడా చైనా ఫోనే.


ఆ బాలుడి పేరు మెంగ్ ఝిషు. త‌న ఇంట్లో సెల్‌ఫోన్‌లో గేమ్స్ ఆడుతున్న స‌మ‌యంలో అక‌స్మాత్తుగా పేలిందా మొబైల్‌. హువాటాంగ్ వీటీ-బీ59 ర‌కం మొబైల్ హ్యాండ్‌సెట్ అది.

పేలుడు సంభ‌వించిన వెంట‌నే పిల్లాడ్ని కుటుంబ స‌భ్యులు ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అక్క‌డ సుమారు అయిదు గంట‌ల పాటు ఆప‌రేష‌న్ చేయాల్సి వ‌చ్చింది. బాలుడి వేలును అతికించ‌డానికి ఛాన్సే లేకుండా పోయింద‌ని డాక్ట‌ర్లు తెలిపారు.

పేలుడు వ‌ల్ల చిన్న‌, చిన్న ప‌దునైన ప్లాస్టిక్ ముక్క‌లు కంట్లో దూసుకెళ్లాయి. దీనివ‌ల్ల క‌నుగుడ్డు దెబ్బ‌తిన్న‌ది. ప్ర‌స్తుతం ఆ బాలుడు ఆసుప‌త్రిలో విశ్రాంతి తీసుకుంటున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here