వారి ముఖాల్లో ఈ భ‌యానికి కార‌ణ‌మేంటో తెలిస్తే..ఉలిక్కిప‌డ‌తారు!

హ‌నోయ్‌: అదో బ్యూటీపార్ల‌ర్‌. అద్దం ముందు కుర్చీలో కూర్చుని ఓ మ‌హిళ‌..నేల మీద కూర్చుని ఇంకో యువ‌తి క‌నిపిస్తున్నారీ పిక్‌లో. ఇద్ద‌రి ముఖాల్లో భ‌యం క‌నిపిస్తోంది. దేన్నో చూసి భ‌యప‌డ్డారు. ఆందోళ‌న‌కు గుర‌య్యారు.

వారి భ‌యానికి కార‌ణ‌మేంటీ? ఓ ఐఫోన్‌. వారిద్ద‌రిలోనే కాదు, ఆ బ్యూటీపార్ల‌ర్‌లో ఉన్న సిబ్బందినీ భ‌య‌పెట్టింది. కార‌ణం.. పెద్ద శ‌బ్దంతో పేలిపోవ‌డ‌మే. హెయిర్ డ్రెస్సింగ్ కోసం అప్పుడే బ్యూటీపార్ల‌ర్‌కు వ‌చ్చిన ఓ యువ‌తి ఐఫోన్ అది. త‌న ఫోన్‌ను ఛార్జింగ్‌కు పెట్టి హెయిర్ డ్రెస్స‌ర్‌తో మాట‌ల్లో ప‌డిపోయింది.

దాని సంగ‌తే మ‌రిచిపోయింది. ఉన్న‌ట్టుండి పెద్ద శ‌బ్దం చేస్తూ ఢామ్మందా ఐఫోన్‌. దెబ్బ‌కు బొగ్గ‌యిపోయింది. ఏమాత్రం ఊహించ‌ని ఘ‌ట‌నతో బెదిరిపోయార‌క్క‌డి వారు.

దాని తాలూకు పిక్ ఇది. వియ‌త్నాం రాజ‌ధాని హ‌నోయ్‌లోని ఓ బ్యూటీపార్ల‌ర్‌లో చోటు చేసుకున్న ఘ‌ట‌న ఇది. అక్క‌డ అమ‌ర్చిన సీసీ కెమెరాల్లో ఈ పేలుడు రికార్డ‌య్యింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here